ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్
( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ )
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్
సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ ఏఎస్ టిఎఫ్ ఎఫ్ఎసి తిరుపతి ఎస్పీ వారు రూపొందించిన ప్రత్యేక కార్యచరణ అమలులో భాగం గా ఆర్ఎస్ ఏఎస్ టిఎఫ్ ఎస్ పి పి. శ్రీనివాస్ వారి పరివేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారి ద్వారా రాబడిన సమాచారం మేరకు కడప రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం చిరంజీవులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి నరేష్ మరియు వారి సిబ్బందిని గురువారం అనగా 13.09.2024వ తేదిన ఉదయం నుండి నంద్యాల జిల్లా చాబోలు మార్గం దగ్గర కర్నూల్ నుండి కడప వైపు వచ్చు పోవు వాహనాలను తనిఖి చేస్తుండగా కర్నూల్ వైపు నుండి , ఒక మినీ లారీ వస్తూ వుండి పోలీసులు వాహనాలు తనిఖి చేయడము గమనించి, అందులోని వ్యక్తులు వాహనము నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆర్ఎస్ఐ మరియు వారి సిబ్బంది వెంబడించి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. అనుమానంతో మినీ లారిని పరిశీలించగా, అందులో ఒక ప్యాకెర్స్ మూవర్స్ చెందిన ఇంటి పరికరాలు బాక్సులు మరియు సుమారు 54 చెక్కబడిన ఎర్ర చందన దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించడము అయినది.
దీనికి సంబంధించి తిరుపతి ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్ పి ఎస్ నందు కేసు నమోధు చేసి, సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. రఫీ కేసు దర్యాప్తు ప్రారంభించడం అయినది. సదరు కేసులో దర్యాప్తు లో భాగంగా పట్టుబడిన ముద్దాయిలను విచారించగా రాజస్థాన్ కు చెందిన వ్యక్తి, హైద్రాబాద్ కు చెందిన ఒకరు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేయడమైనది. పట్టుబడిన వ్యక్తులు రాజస్థాన్, హైద్రాబాద్ ప్రకాశం జిల్లాకు, చెందిన వారుగా గుర్తించడం అయినది . ఈ కేసు వెనుక ఉన్న ఇతర స్మగ్గ్లర్లను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాము.
స్వాధీనము చేసుకొన్న వస్తువులు :-
1) టీజీ 10T 0487 అను నంబరు గల టాటా కంపెనీకి చెందిన మినీ లారీ.
(2) పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 54, బరువు 1250 కేజీలు.
ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న అధికారులు మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటించడమైనది