సమస్యను పూర్తిగా పరిష్కరించిన పామిడి ఇంచార్జ్,
జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14 అనంతపురం జిల్లా ( పామిడి రూరల్ )
పామిడి మండలం, గుంతకల్లు నియోజకవర్గం, శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు పామిడి మండలం నాయకుడు ఆర్ ఆర్ రమేష్ నిన్నటి రోజున పామిడి మండలం నీలూరు గ్రామంలో పర్యటించి పలు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో మురుగునిటీ సమస్య ఎక్కువ గా ఉందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆర్ ఆర్ రమేష్ నీలూరు గ్రామానికి జెసిబి వాహనం పంపించి పనులు చేయించడం జరిగింది.నీలూరు గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగునిటీ కాలువలో ఉన్న పూడికను మొత్తం తీయించి మురుగునిటీ సమస్యను పూర్తిగా పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో టీడీపీ కార్యకర్తలు, మరియు కూటమి కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.