మండల కేంద్రంలో ఉదృతంగా మారిన గ్రామ సింహాల పోరు
ఆగస్టు 21 (జనసముద్రం న్యూస్ చింతపల్లి)
మండల కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడద. చిన్న పిల్లలను పెద్దలను ఒంటరిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఘోరంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. వారం రోజులలోనే 20 మందికిపైగా కరిచి గాయపరిచిన తీరు గ్రామంలో నెలకొన్నది.వీరిలో గంట జగదీష్ యాదవ్ ,ఎంట్ల వెంకటయ్య ఎంట్ల శ్రీను, భోగరాజు అజయ్, వెంకటమ్మ ఇలా అనేకమందిని కరుస్తూ మనుషుల రక్తానికి అలవాటు పడటం జరిగింది .వీటిని అదుపు చేయాలని అనేకసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోని వైనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతోమంది చిన్నారులు కుక్కల దాడిలో చావడం ఖాయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే గ్రామ ప్రజలతో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలపడం జరిగింది.