జన సముద్రం న్యూస్ చింతూరు, ఏడుగురాళ్ల పల్లి ఆగస్టు 17:-
కలకత్తాలో విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని పైఅత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాని కోరుతూ శనివారం నాడు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఓ పీ సేవలను నిలిపివేసి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్స్.ప్రసన్న. విశ్వ చైతన్య మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఓ మహిళా పీ జీ వైద్య విద్యార్థిని పై క్రూరంగా అత్యాచారం చేయడమే కాకుండా హత్య చేసి చంపడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు మరలా పుణరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. వైద్యులకు వైద్య సిబ్బంది కి రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలన్నారు. ఐఏంఏ ఆదేశాల మేరకు ఒక్కరోజు ఓపీ సేవలు నిలుపుదల చేసి బాదితురాలి కుటుంబానికి న్యాయం జరిగేందుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సిబ్బంది ఎంపిహెచ్ఎస్ రామయ్య,స్టాఫ్ నర్స్ రత్తమ్మ,ఫార్మసిస్ట,పాప లేబ్ టెక్నీషియన్,శైలజ తదితరులు పాల్గొన్నారు.