సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 జయంతి

Spread the love
జనసముద్రం న్యూస్, ఆగస్టు 18

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆగష్టు 18 న 374 జయంతి సందర్భంగా (17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్) సర్వాయిపాపన్నగౌడ్,
చరిత్ర తిరగరాసిన పేదోళ్ల రాజు , వెలుగులోకి రాని యోధుని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
17న శతాబ్ధంలో అప్పటికి ఆంగ్లేయులు ఇంకా భారతదేశంపై కన్నేయడం కన్నా ముందు సామ్రాజ్యవాద కాంక్షతో దేశాన్ని.. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న…కానీ ఆ చరిత్ర పుటల్లో కొందరి అమరవీరుల త్యాగాలకు సరైన స్థానం దక్కలేదు. అలాంటి వారిలో ఒకరు సర్దార్ సర్వాయి పాపన్.
రాచరికపు వ్యవస్థపై రిగిలిన వ్యతిరేకత
ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఖిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న సొంత గ్రామం. 1650 అగస్ట్ 18న పుట్టాడు.గౌడ కులంలో పుట్టిన పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి సర్వమ్మే అన్నీ తానై అతడిని పెంచి పెద్దచేసింది. చిన్నతనం నుంచే జమీందార్లు, దొరల అరాచకాలను చూస్తూ పెరిగిన సర్వాయి పాపన్నలో సహజంగానే రాచరికపు వ్యవస్థపై వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. తల్లి కోరిక మేరకు గౌడ కుల వృత్తిని చేపట్టిన సర్వాయి పాపన్నకు.. దొరల చేతుల్లో, మొగల్ సామ్రాజ్య సైనికుల చేతిలో ఎదుర్కొన్న అవమానాలు వారిపై ఉన్న వ్యతిరేకభావాన్ని మరింత పెరిగేలా చేశాయి. తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహేబ్‌లతో కలిసి తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అరాచకాల గురించి వివరించి వారిలో చైతన్యం రగిల్చాడు.
తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ గడగడలాడించిన సర్దార్ బహుజనుల నుంచి భారీ మద్దతు కూడగట్టుకున్న సర్వాయి పాపన్నకు అనుకోకుండానే ఊహించని ఘటన ఎదురైంది. గ్రామాల్లో శిస్తులు వసూలు చేసుకుని గోల్కొండ కోటకు తిరిగి వెళ్తున్న సైనికులు.
సర్వాయి పాపన్న కల్లు గీసే తాటి చెట్ల వద్ద ఆగి ఎప్పటిలాగే ఎలాంటి రుసుము ఇవ్వకుండా కల్లు సేవించారు…అదే సమయంలో తన స్నేహితుడిపై దాడి చేశారు. ఆ దాడిని అడ్డుకున్న పాపన్న అక్కడికక్కడే ఆ సైనికుడి మెడ నరికేశాడు..తనపై దాడికి దిగిన మిగిలిన సైనికుల పనిపట్టి… ఆ సైనికులు వసూలు చేసిన శిస్తును తిరిగి అక్కడి గ్రామాల్లో పేదలకు పంచిపెట్టడంతో మొదలైన సర్వాయి పాపన్న ఉద్యమం ఢిల్లీని గడగడలాడించేవరకూ సాగింది.
సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సామాన్యుడు రాజ వంశానికి చెందినవాడు కాదు రాజుల అండదండలు లేవు..కానీ అతి సామాన్యుడైన సర్వాయి పాపన్న తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నాడు. అంతకన్నా ముందుగా ప్రజలను దోచుకుతింటున్న పెత్తందార్ల పనిపట్టాడు. జమిందార్లు, దొరలు దోచుకున్న సొమ్మును తిరిగి దోచుకుని ప్రజలకు పంచుతూ. మరోవైపు ఆయుధాలు సమకూర్చుకున్నాడు.తాను పుట్టి పెరిగిన ఖిలాషాపురంలోనే ఒక పెద్ద శత్రుదుర్భేద్యమైన దుర్గాన్ని నిర్మించాడు. అక్కడి నుంచే తన రాజ్యపాలన ఆరంభించాడు. తన సైన్యాన్ని వెంటేసుకుని వెళ్లి చిన్న చిన్న సంస్థానాలు, దొరల గడీలపై దాడులు చేసి వాటిని ఆక్రమించుకున్నాడు. రాజ కుటుంబంలో పుట్టకపోయినా.. రాజనీతిజ్ఞిని ప్రదర్శిస్తూ పేదోళ్లకు రాజయ్యాడు, అరాచకుల సింహస్వప్నంగా మారాడు.
బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే, అగ్రవర్ణాలది అధికారమయితే నియంతృత్వమే బహుజనులకు బహుమతి అందుకే క్షత్రియుడే కత్తిపట్టాలన్న సూత్రాన్ని ఓ యోధుడు మార్చాడు. సబ్బండ వర్ణాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడు
పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి అందించాడు. పాపన్న గౌడ్. వీరత్వంలో శివాజీకి ఏమాత్రం తీసిపోని సర్వాయి పాపన్నను గుర్తు చేసుకుందాం.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడున్నర శతాబ్దాల క్రితం సంచలనం. రాజ్యాధికారం గురించి కనీసం ఆలోచించడమే పాపమయిన కాలంలో సింహాసనాన్ని అధిష్టించిన బహుజన సింహం.. నవాబుల తాబేదార్ గా మారిన అగ్రవర్ణ దోపిడి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ధైర్యశాలి.
తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మే సర్వస్వమై పాపన్నను పెంచింది .రాచరిక వ్యవస్థ నీడలో జమీన్ దార్లు, జాగీర్ దార్లు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూడడంతో అతనికి చిన్నతనంలోనే తిరుగుబాటు లక్షణం నరనరాన ఇంకింది.
అందుకే ఎలాగైనా ఆ నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకున్నాడు. కులవృత్తిని కూడా వదిలిపెట్టి ప్రజల కోసం పోరుబాట పట్టాడు. అయితే దోపిడీ పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేశాడు. అందుకే స్నేహితులైనన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ లతో గెరిల్లా సైన్యాన్ని తయారుచేశాడు. భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేశాడు. సంపదను బహుజన పేదలకు పంచాడు, పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలకు చేరింది. చిన్న చిన్న సంస్థాలను ఆక్రమించి రాజ్యాన్ని విస్తరించాడు పాపన్న గౌడ్. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్నీ రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు.
ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించాడు. పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడు. కులవృత్తులను ప్రోత్సహించాడు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించాడు.
ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనున్న ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు 1960 దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పొంతలుతొక్కింది. ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు, వ్యక్తుల అస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది, ఈ నేపథ్యంలోనే 17వ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది. తొలి బహుజన రాజ్యంవిజయం సాధించినవారి గురించే రాయబడిందే చరిత్ర అయ్యింది. క్షత్రియ రాజులు, అగ్రవర్ణ భూస్వామ్య కులాలవారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు, దోపిడీలు, లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా, వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది.
వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వాయి పాపన్నను దోపిడీ దొంగగా చిత్రీకరించింది. ‘దుర్గములు నిర్మించి, దుర్గములను సాధించి రాజ్యమును విస్తరించుకొన ప్రయత్నించినవాడు దొర గాక దొంగ యెట్లగును అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మ కోణంలో పాపన్న చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
పాపన్న తన 59 సంవత్సరాల కాలంలో ఖిలాషాపురం, షాపురం, కొలనుపాక, భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు. భూస్వామ్య, బానిసత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయ సమాంతర బహుజన రాజ్యాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసిన వీరుడి చరిత్రను చరిత్రకారులు మట్టిలో కప్పేశారు. విజేతలు మాత్రమే నిర్మించిన చరిత్రను పరాజితుల కోణం నుండి పునర్నిర్మాణం చేసుకోవాలి. అధిపత్య కులాలవారు బహుజనులను అణగదొక్కుతున్న17 వ శతాబ్దంలోనే పాపన్న సైన్యాన్ని తయారు చేసుకున్నడు. అతని నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ నేటి తరం నేర్చుకోవాలి సబ్బండ వర్గాలను ఏకం చేసి 1675 సంవత్సరంలో మొదలైన పోరాటం సర్వాయిపేట, మొఘల్ అనుయాయులు, ఫౌజీదారుల నుంచి కొల్లగొట్టిన ధనంతో 12 ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్నాడు. సర్వాయిపేట కేంద్రంగా రాజ్య విస్తరణ మెదలుపెట్టి, 1698 తాడికొండ లో 50 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బురుజులతో బలమైన కోటను నిర్మించాడు. షాపురం కోటను 1700 సంవత్సరంలో మొదలుపెట్టి 1705 వరకు నిర్మించినట్టుగా తెలుస్తున్నది. భువనగిరి, భైరాన్‌పల్లి, హుస్నాబాద్ ప్రాంతాలలో రక్షణ స్థావరాలను ఏర్పాటు చేసుకొని పాపన్న 25 సంవత్సరాల కాలం పాటు యుద్ధాలు, పోరాటాలలో మునిగి తేలాడు.
దక్కన్ నేలమీద చెరగని ముద్ర
సర్వాయి పాపన్న మొఘల్ వైశ్రాయుల నిరంకుశ ఆధిపత్యాన్ని, తన తల్లి పేరును ముందుంచుకుని సర్వాయి పాపన్నగా ప్రసిద్ధి చెందాడు. ఇలా చరిత్రలో తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్నవారు శాతకర్ణి తర్వాత పాపన్న మాత్రమే.
నాటి సమాజంలో పాతుకుపోయిన బలమైన ఫ్యూడల్ శక్తుల కోట గోడలను కూలగొట్టిన యోధుడు పాపన్న. శత్రువులకు చిక్కకుండా, కోటల నిర్మాణం ద్వారా తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని విస్తరించడం కోసం అహర్నిశలు శ్రమించడం అసాధారణ అంశం.
పాపన్న ఎంతకాలం పరిపాలన చేశాడనే అంశం కన్నా, ఒక సాధారణ వ్యక్తికి ఇంత ఎలా సాధ్యమైందనేదిముఖ్యం. దాదాపు మూడు దశాబ్దాల పాటు కాలానికి ఎదురీది దక్కన్ నేలమీద తనదైన చెరగని ముద్రవేసిన రాజు….. ఫూలే, పెరియార్, అంబేద్కర్ స్ఫూర్తి నేడు తక్షణ అవసరం అని మాట్లాడుకుంటున్నం.
కానీ, దాదాపు శతాబ్దాల కిందనే దీనిని గ్రహించిన పాపన్న స్ఫూర్తిదాయక పోరాటం ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కులం, మతం, వర్గం, జాతి, అనే సమాజ విచ్చిన్నకర అంశాలను పక్కనపెట్టి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం, ఆకలి, అంటరానితనం దోపిడీ లేని సమాజం కోసం నడుం బిగించడమే సర్దార్ సర్వాయి పాపన్నకు మనం ఇచ్చే నివాళి.

జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
సుధాకర్ VLA సంగినేనిపల్లి

  • Related Posts

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు