జనసముద్రం జూలై 28:డిండి:
నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని నగార దుబ్బ తండ గ్రామపంచాయతీ నుండి తవక్లాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలుగా తయారై ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు యనమల నవీన్ శనివారం తెలిపారు.రాత్రి వేళలో వచ్చే ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి,గత ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి శిలాఫలకాలు నిర్మించి ఘనంగా ఓపెనింగ్ చేశారు.కానీ ఇంత వరకు ఏమీ లేదు.అధికారులు స్పందించి వెంటనే బీటీ రోడ్డు వేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా ఎనమల్ల నవీన్ కోరడం జరిగింది.