పట్టించుకున్న నాధుడే కరువాయే
కామేపల్లి,జనసముద్రం, జులై 22 :
సాతాని గూడెంపంచాయతీ పరిధిలోని సాతాన్ని గూడెం “యుపిఎస్” ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలకు ఆ నీళ్లలోనే నడిచి వెళుతూ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లు ఎత్తులో ఉండటంతో పడిన వర్షపు నీరు పల్లంలో ఉన్న పాఠశాల ఆవరణంలోనే నిలిచిపోతున్నాయి.
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు
మురికి నీటిలో నడిచి వస్తున్న పాఠశాలలో
దుర్వాసన వెదజల్లుతున్న వైనం , ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాఠశాలకు ఆ నీళ్లలోనే నడిచి వెళుతూ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ఇళ్లు ఎత్తులో ఉండటంతో పడిన వర్షపు నీరు పల్లంలో ఉన్న పాఠశాల ఆవరణంలోనే నిలిచిపోతున్నాయి. కొద్దిపాటి కాలువ తీస్తే పడిన వర్షం నీరు నిలవకుండా వెళ్లే అవకాశం ఉన్నప్పటికి పట్టించుకున్న నాఽథుడే లేడని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.





