జూన్ 26 (జనసముద్రం న్యూస్ చింతపల్లి ) చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామ పరిధిలోని విరాట్ నగర్ కాలనీ వద్ద వృద్రురాలి మెడలోని గొలుసు లాక్కెళ్లిన వైనంబుధవారం రోజు నాడు సాయంత్ర నాలుగు గంటల సమయం లో కుర్మేడు గ్రామానికి చెందిన గోరేటి బక్కమ్మ భర్త నరసింహ, వయసు 60 సంవత్సరాలు కుర్మేడు శివారులో వున్న విరాట్ నగర్ కాలనీ వద్ద గల తన పొలంలో వ్యవసాయ పనులు చూసుకొని తిరిగి తన ఇంటికి రావడం కొరకు నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే ఎక్కి ఇంటికి వస్తుండగా, అదే సమయంలో విరాట్ నగర్ కాలనీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒక బైకు పైన ఆమె వద్దకు వచ్చి, ఇది ఏ ఊరు పెద్దమ్మ అని అడుగుతూ ఆమె మెడలో ఉన్న సుమారు నాలుగు తులాల బరువు గల బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయినారు.
ఈ విషయం గురించి వృద్రురాలు మరియు చుట్టుపక్కల వారు చరవాణి ద్వారా చింతపల్లి మండల పోలీస్ స్టేషన్ విషయాన్ని తెలియజేశారు వెంటనే స్పందించిన పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని సంఘటన స్థలానికి చేరువలో ఉన్న ఇంటిలో ఉన్న సిసి ఫుటేజ్ పరిశీలించిన సీఐ ఎం నవీన్ కుమార్ ఎస్సై బియాదయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు