జనసముద్రం న్యూస్ ,జూన్17:
చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్ పేరుతో వచ్చే లింక్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని.. సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలన్నారు.