మెరుగైన సేవలు అందించాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన
దళితరత్న బుర్రివెంకన్న
జన సముద్రం ప్రతినిధి దేవరకొండ మే:30
విధి నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్ డ్రైవర్ కోమండ్ల.శేఖర్ ను ఆ జాగ్రత్తగా వచ్చి లారీ తో టక్కరిచ్చి ప్రమాదం కి గురిచేసినందున ప్రభుత్వం ఇతనికి అన్ని విధాల ఆదుకోవాలి,
మెరుగైన వైద్యాన్ని అందించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దళితరత్న బుర్రి వెంకన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ. నల్గొండ జిల్లా వాసుడైనటువంటి కోమండ్ల శేఖర్ వీధి నిర్వహణలో భాగంగా 108 అంబులెన్స్ తీసుకొని నీలింనగర్ కోదాడ జడ్చర్ల రహదారి వెంట పోతుండగా అతివేగంగా జాగ్రత్తగా లారీ నడుపుతూ లారీ డ్రైవర్ మంగళవారం అర్ధరాత్రి అంబులెన్స్ కు టక్కరియ్యడం జరిగింది.
ఘటనలో అంబులెన్స్ లారి ఢీకొన్న సంఘటనలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైన అంబులెన్స్ డ్రైవర్ శేఖర్ కు తీవ్ర గాయాలై, కొంత భాగం మంటలతో ఖాళీ గాయాలతో స్థానికుల సహాయముతో బయటపడి హాస్పటల్లో చికిత్స పొందుతున్నటువంటి శేఖర్ కి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యాన్ని అందించాలని. వారి కుటుంబాన్ని ఆర్థికపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. దళిత రత్న బుర్రి వెంకన్న స్పందిస్తూ మాట్లాడుతూ ఆపదలో 24 గంటలు.ప్రజా ప్రాణాలను కాపాడేటువంటి 108 వాహనాలు వారి సేవలు మరువలేనివని అలాంటివారికి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలని వారిని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు