గోకవరం జన సముద్రం న్యూస్ మార్చి 30
సైకిల్ గుర్తుకు ఓటు వేసి జ్యోతుల నెహ్రూ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని నెహ్రూ కోడల అయినటువంటి జ్యోతుల లక్ష్మీదేవి, మనవడు అనీష్ నెహ్రూ గోకవరం మండలంలో చేపట్టిన ప్రచారం ఐదవ రోజుకు చేరుకుంది. శనివారం నాడు గంగంపాలెం గ్రామంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులతో కలసి వీరి యొక్క ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా లక్ష్మీదేవి, అనీష్ నెహ్రూ ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలలో ప్రతీ గ్రామంలో అభివృద్ధి కుంటుబడిందని, నెహ్రుకు ఓటు వేస్తే మరల అభివృద్ధి గాడిలో పడి ప్రతీ గ్రామం ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా టిడిపి జనసేన మమ్మడి మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ల అధిక రేట్లతో ప్రతీ కుటుంబానికి ఆర్థిక భారం పెరిగిందని, టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడునని ఆమె తెలిపారు.
అదేవిధంగా మహిళా శక్తి లో భాగమైనటివంటి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలకు వివరించడం జరిగింది.యువగళం ద్వారా డిగ్రీ చదువుకున్న ప్రతీ నిరుద్యోగికి ప్రతి నెలా మూడు వేల రూపాయలు చొప్పున అందించబడునని ఆమె వివరించారు. రాష్ట్రం బాగుపడాలంటే టిడిపి జనసేన బిజెపి కూటమి అధికారంలో రావాలని తద్వారా భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.