
యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.24,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్స్ షట్టర్ తాళం పగలగొట్టి పైకి లేపి వైన్స్ లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు మూడు లక్షల రూపాయల నగదు అపహరణకు గురైందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





