జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గంజాయి మత్తులో ఒక అమ్మాయి వింతగా ప్రవర్తించడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు సందేహం రావడంతో.. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించడంతో ఈ వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో ఈ వ్యవహారంలో మరో ఘోరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… ఓ అమ్మాయికి గంజాయి అలవాటు చేసి ఏడాదికాలంగా పలుమార్లు ఆమెను రేప్ చేసినట్లు పోలీసు విచారణలో తేలిందని తెలుస్తుంది. ఈ మేరకు ప్రేం, నితిన్, వెంకటేష్ అనే ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిపై ఫోక్సో, ఎన్.డీ.పీ.సీ. యాక్ట్ కింద కేసులు నమోదు చేశారని అంటున్నారు. దీంతో… ఈ వ్యవహారంలో మరెన్ని ఘోరాలు వెలుగులోకి వస్తాయో అనేది ఇప్పుడు ఆందోళనగా మారింది!!
గా… జగిత్యాల పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను ట్రాప్ చేసిన ఓ ముఠా ఆమెకు గంజాయిని అలవాటూ చేసిన సంగతి తెలిసిందే! ఆమెకు మొదట్లో చాక్లెట్ల రూపంలో గంజాయిని ఇచ్చి అడిక్ట్ చేయడంతో… అప్పటినుంచి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలుఎట్టగా.. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రకృతి ఎన్.జీ.వో. ఆధ్వర్యంలో కౌన్సిలెంగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు రంగంలోకి దిగి బాధితురాలిని ఆరా తీయగా… ఆమె చదువుతున్న స్కూల్లో ఆమెతో పాటు సుమారు 15మంది వరకూ బాలికలు గంజాయికి అడిక్ట్ అయినట్లు గుర్తించారని, వారిని ఒక గ్రూప్ ట్రాప్ చేసి సిటీ అవుట్ కట్స్ లోని రేవ్ పార్టీలకు తీసుకెళ్తుందని.. ఇదే సమయంలో వ్యభిచారానికీ తరలిస్తుందని తెలియడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ అనంతరం పోలీసులు దర్యాప్తు పారంభించగా… నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) కూడా రంగంలోకి దిగినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక పదోతరగతి చదువుతున్న అమ్మాయికి గంజాయి అలవాటు చేసి ఏడాదిగా పలుమార్లు రేప్ చేసినట్లు తెలియడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కరంగా మారిందని అంటున్నారు.
ఇద్దరిపై గంజాయి కేసు నమోదు
Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో…