జనసముద్రం న్యూస్ అడ్డగూడూర్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామానికి చెందిన భూమి పంపకాల వివాదం గురించి ఇరు వర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్న కేసులో నేడు ఇరువర్గాల వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్ ఐ డి. నాగరాజు తెలిపారు
గత నెల 07.06.2023 న మార్త వీరయ్య మరియు మార్త సైదులు ఒకరినొకరు గొడ్డళ్లతో దాడి చేసుకోగా ఇరువర్గాల వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అట్టి కేసులకి సంబందించి నేడు ఇరువర్గాల వారిని అనగా 1)మార్త సైదులు తండ్రి బుచ్చయ్య వయస్సు: 40 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, మానాయకుంట గ్రామం, అడ్డగూడూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా 2) మార్త వీరయ్య తండ్రి బుచ్చయ్య వయస్సు: 43 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: వ్యవసాయం, మానాయకుంట గ్రామం, అడ్డగూడూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా లను ఈ రోజు అడ్డగూడూర్ ఎస్సై అరెస్టు చేసి రిమాండ్ కు నల్గొండ జైల్ కి పంపారు
ఈ సందర్బంగా అడ్డగూడూర్ ఎస్సై మాట్లాడుతూ 11 గుంటల భూమి కోసం సొంత అన్నదమ్ములే ఒకరిపైన ఇంకొకరు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారని, దీని వలన ఇరు వర్గాల వారికి చెరో పది లక్షల వరకు హైదరాబాద్ లోని ఓమ్ని హాస్పిటల్ నందు ఖర్చు అయిందని, అదే విదంగా ఇరు వర్గాల వారిపైన 307 ఐపిసి సెక్షన్ ల కింద కేసు నమోదు, ఈ విదంగా తొందరపాటు వలన ఇరు కుటుంబాలు ఆర్దికంగా మరియు మానసికంగా బాధపడాల్సి వచ్చిందని కావున తొందరపడి ఇలా చేసుకోవద్దని ఏమైనా సమస్యలు వుంటే కౌన్సెల్లింగ్ ద్వారా లేదా లీగల్ గా తేల్చుకోవాలని, అలా కాకుండా శాంతిభద్రతలకు భంగం కలిగించే విదంగా ప్రవర్తించినట్లు అయితే వారి పైన చట్టపరంగా వెంటనే కఠిన చర్యలు వుంటాయని అడ్డగూడూర్ ఎస్సై డి నాగరాజు తెలపడం జరిగింది.