రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ జులై 8
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం జాతీయ ప్రధాన రహదారి సమీపంలో మూడు రోజులు క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు మండల పోలీస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు వివరాలలోకి వెళితే
తేదీ 6.7.23 న చిన్న ఓరంపా డు గ్రామం లో జరిగిన చంద్ ప్యారి 67 సం,, హత్య కేసులో ముద్దాయి అయిన షేక్. కరిముల్ల s/o మస్తాన్ 29 సం,, చిన్న ఓరంపా డు గ్రామము లో అరెస్టు చేయడమైనది.
ముద్దాయి చనిపోయిన చంద్ ప్యారి,యొక్క పెంపుడు కొడుకు. తనకు ఆస్థి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తుందేమో అని తేదీ 5.7.23 న అర్థ రాత్రి ముద్దాయి వాళ్ళ అమ్మ ఒక్కతే ఇంటి బయట వరండాలో నిద్రపోతుండగా ముద్దాయి కర్ర తీసుకొని కొట్టి చంపినాడని దర్యాప్తులో తేలింది. అని రైల్వే కోడూరు నియోజకవర్గం పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్
నరసింహారావు, ఓబువారిపల్లి మండల పోలీస్ అధికారి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక ప్రకటన ద్వారా తెలిపారు
మాచర్లలో అత్యంత వైభవంగా జరుగుతున్నబతకమ్మ ఉత్సవాలు.
Spread the love మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి…