
క్షత్తగాత్రుడిని పరామర్శించిన మాజీ మేయర్ రామ్మోహన్
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, జూన్ 13
ఉప్పల్ నియోజకవర్గం జమ్మిగడ్డ నివాసి అయిన చంద్రయ్య యాదవ్ గారి కుమారుడు సాయి యాదవ్ నిన్న రాత్రి జమ్మిగడ్డ వద్ద జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఈసిఐఎల్ లోని శ్రీకర హాస్పటల్ చేరుకొని డాక్టర్లతో మాట్లాడి సాయి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లకు సూచించారు. అవసరం అయితే నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ మెరుగైన వైద్యం అందేలా చూస్తానని అన్నారు. తక్షణ ఆర్ధిక సహాయంగా వారి కుటుంబానికి 10,000/- రూపాయలు అందచేసి ఎల్లవేళలా కుటుంబానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.





