మల్కాజ్గిరి శామీర్ పేట జనసముద్రం న్యూస్ జూన్ 13
బుధవారం శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి లను కలసి ఆయన బయోడేటా ను సమర్పించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పదవి కాలం పూర్తి కానున్న దరిమిలా మైనారిటీ రిజర్వేషన్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇరువురు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి లు మాట్లాడుతు సోషల్ మీడియా పరంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అఫ్జల్ ఖాన్ కు మంచి పదవి ఇప్పించే పూర్తి బాధ్యత మాదే నని అన్నారు. ప్రతి చోటా పార్టీ ని ఏకం చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తు ముందుకు సాగుతున్న అఫ్జల్ ఖాన్ ను మల్లారెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డి లు అభినందించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ ఉద్యమ కారుల సమస్యలు పరిష్కరించాలని కోరగా ఇరువురు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ గౌస్, వేణు గౌడ్, విష్ణు చారి, తదితరులు పాల్గొన్నారు.