వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!

Spread the love

జనసముద్రం న్యూస్,జూన్ 09:

రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం లోనూ ఏపీ లోనూ కరువు వచ్చింది అని అంటున్నారు. ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రం తెలంగాణా లో కూడా సరైన స్లోగన్ లేక రాజకీయ చాణక్యుడు కేసీయార్ సైతం ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు.

ముందుగా దేశం లో ఒక సారి చూస్తే నరేంద్ర మోడీ కి 2014లో అద్భుతమైన నినాదం దొరికింది. అదే దేశం భవిష్యత్తు రూపు రేఖలు మార్చేస్తాను అన్నదే ఆ నినాదం. కాంగ్రెస్ ఆరు దశాబ్దాల చీకటి పాలన అంతమొందించి దేశాని కి  సరికొత్త వెలుగుల వైపు గా తీసుకుని వెళ్తామని మోడీ చెప్పారు. సూపర్ హిట్ లాంటి సక్సెస్ కొట్టారు.ఇక 2019 నాటికి మరో నినాదం అందివచ్చింది. అదే దేశాన్ని పొరుగు దేశాల నుంచి ప్రత్యేకించి దాయాది పాకిస్థాన్ నుంచి కాపాడు కోవాలీ అంటే డేరింగ్ అండ్ డేషింగ్ బీజేపీ కే మళ్లీ రూలింగ్ ఇవ్వాలని. అది ఎంతలా క్లిక్ అయిందంతే 303 దాకా సీట్లు బీజేపీ కి వచ్చిపడ్డాయి. విపక్షాలు ఎంత గింజుకున్నా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి.

ఇపుడు చూస్తే బీజేపీ అమ్ముల పొది లో అస్త్రాలు అన్నీ అయిపోయాయి. అయోధ్య రామాలయం నిర్మాణం అవుతోంది కాశ్మీర్ ఇష్యూ కూడా లేదు పాకిస్థాన్ బూచి అంతకంటే లేదు మరి ఏంటి నినాదం అంటే ఈ రోజు కు అయితే ఏమీ లేదు అనే చెప్పాలి. దాంతోనే మోడీ ప్రసంగాలు తేలిపోతున్నాయని ఆయన ఇమేజ్ మసకబారింది అని అంటున్నారు.విపక్ష కూటమి లో కూడా ఇదే రకంగా సీన్ ఉంది మోడీ గద్దె దిగాలి అని చెప్పడమే తప్ప తాము ఏం చేస్తామో చెప్పే అద్భుతమైన నినాదం ఏదీ కాంగ్రెస్ సహా విపక్షాల కు చిక్కడంలేదు. దాంతో వారికి కూడా గెలుపు గుబులు ఎక్కడో పట్టుకుని ఉంది. ఏ విధంగా ఎన్నికల యుద్ధాని గెలవాలని చూస్తున్నారు.

తెలంగాణా లో సేం టూ సేం అన్నట్లుగానే సీన్ అంతా ఉంది. కేసీయార్ అంటే మంచి మాటకారి అన్నది తెలిసిందే. ఆయన పంచ్ డైలాగులు అలవోకగా పేలుస్తారు. అయితే కేసీయార్ తెలంగాణా వచ్చాక రెండు ఎన్నికల ను చూశారు. బంగారు తెలంగాణా అన్న పవర్ ఫుల్ స్లోగన్ తో ఒక ఎన్నికల వెళ్ళి సక్సెస్ కొట్టారు. 2018 ఆత్మ గౌరవ తెలంగాణా అంటూ మరోసారి  గెలిచారు ఈసారి కేసీయార్ వద్ద కూడా స్ట్రాంగ్ స్లోగన్స్ ఏవీ లేవు అనే అంటున్నారు. ఇంకా సెర్చ్ చేస్తున్నారు.ఏపీ లో చూస్తే జగన్ కి 2019 లో   ఒక్క చాన్స్ అంటూ ఇచ్చారు గద్దే దిగాల్సిందే అని బాబు అంటున్నారు. కానీ అదే బాబు కు మూడు చాన్సులు జనాలు ఇచ్చారు కదా మరి ఆయనకు ఎందుకు సీఎం పదవి అన్న చర్చ వెంటనే వస్తోంది. ఇక జగన్ కి అనుభవం లేదు అన్న నినాదం ఫెయిల్ అయింది. అభివృద్ధి లేదు అంటూ ఇంకో స్లోగన్ అందుకున్నా దాని కి పెద్దగా జనాలు కనెక్ట్ కావడం లేదు. జగన్ సర్కార్ కి డైరెక్ట్ గా గుచ్చుకునే వెపన్ లాంటి స్లోగన్ కోసం బాబు కూడా అన్వేషిస్తున్నారుట.

ఇక జగన్ విషయానికి వస్తే ఆయన 2019లో ఒక్క చాన్స్ అన్నారు జనాలు ఇచ్చారు. ఇపుడు ఆయన కు ఏమి చెప్పి జనాల వద్ద నుంచి ఓట్లు అందుకోవా లో అర్ధం కావడంలేదు అంటున్నారు. నా పాలన నచ్చితే మీకు మంచి జరిగితే ఓటు వేయండి అన్న స్లోగన్ పెద్దగా కిక్ ఇవ్వడంలేదు. పైగా ఇది బూమరాంగ్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక నా పాలన చూడండి అంటే కేవలం సంక్షేమం గురించే అది కూడా కొన్ని సెక్షన్ల గురించే చెప్పుకోవాలి.దాంతో మరోసారి అధికారం లోకి వచ్చేందుకు బ్రహ్మాండమైన స్లోగన్ ఏదీ అని అని గన్ లాంటి జగన్ కూడా ఆలోచిస్తున్నారుట. అలాంటి  నినాదం ఉంటేనే ఏపీ లో ఎన్నికలను గట్టెక్కేది అన్నది వైసీపీ కి తెలియనిది కాదు అని అంటున్నారు. పవన్ సైతం వారాహి రధమెక్కి వస్తున్నా వైసీపీ వ్యతిరేక ఓటు అంటున్నారు. జగన్ ఉండకూడదు అంటున్నారు. కానీ అవి ఏమంతా ఆకట్టుకోవడం లేదు అని వినిపిస్తోంది. ఆయన కూడా అదిరిపోయే స్లోగన్ తోనే వస్తేనే ఏపీ జనాలు ఆ వైపు చూస్తారు అని అంటున్నారు.

  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు