జనసముద్రం న్యూస్,జూన్ 06:

వైసీపీ ఎంపీ మీద సొంత వదిన ఫిర్యాదు చేసింది. అది స్పందన కార్యక్రమం లో చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది ఆ వైసీపీ ఎంపీ ఎవరో కాదు కాకినాడ లోక్ సభ సభ్యురాలు వంగా గీత. ఆమె మీద డైరెక్ట్ గా ఆమె అన్న గారి సతీమణి ఫిర్యాదు చేశారు. తమ ఆస్తులను బలవంత గా రాయించుకున్నారు అంటే ఆమె వదిన కళావతి స్పందనకు ఫిర్యాదు చేశారు.
ఇంత కీ ఆమె ఫిర్యాదు చేసినది ఏంటి అంటే వంగా గీత అన్న గారు అయిన క్రిష్ణ కుమార్ నుంచి గీత 2006లో ఆస్తుల ను బలవంతంగా రాయించుకున్నారుట. ఇక గీత సోదరుడు క్రిష్ణ కుమార్ 2010లో మరణించార ని ఆమె పేర్కొన్నారు.ఆనాటి నుంచి తాను తన పిల్లలు కూడా కోర్టు లో ఈ ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. అయితే వంగా గీత తన రాజకీయ పరపతి ని ఉపయోగించి తమను బెదిరిస్తున్నారు అని కళావతి ఆరోపిస్తున్నారు.ఇక వంగా గీత మాత్రమే కాకుండా అమె సోదరి కుసుమ కుమారి దంపతుల మీద కూడా కళావతి ఫిర్యాదు చేశారు. తన భర్త నుంచి రాయించుకున్న ఆస్తుల విషయం లో గీత ఆమె సోదరి కుటుంబం అంతా బెదిరింపుల కు దిగుతూ తీరని అన్యాయం చేస్తున్నారు అని ఆమె వాపోయారు.
ఇక ప్రతీ సోమవారం కలెక్టర్ కి స్పందన కార్యక్రమం ద్వారా వినతులు ఫిర్యాదులు పౌరులు ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఈసారి స్పందన కు మాత్రం కాకినాడ కలెక్టర్ కి ఏకంగా వైసీపీ ఎంపీ అధికార పార్టీ కి చెందిన కీలక నాయకులురాలు వంగా గీత మీదనే ఫిర్యాదు రావడం తో అధికారులు కూడా ఒకింత షాక్ అయిన నేపధ్యం ఉంది.తనకు తన కుటుంబానికి న్యాయం చేయాల ని ఎంపీ వంగా గీత వదిన అయిన కళావతి కోరుతూండడంతో స్పందన లో అధికారులు ఏమి చేస్తారు అన్నది చర్చనీయాంశంగా ఉంది. అయితే ఆస్తుల వివాదం వ్యక్తిగత గొడవలు అన్నీ కూడా కోర్టుల లో తేల్చుకోవాల్సిన లీగల్ అంశాలు కాబట్టి స్పందన లో వచ్చిన ఈ ఫిర్యాదుని అలా పక్కన పెడతారా లేక మానవీయ కోణం నుంచి ఆలోచించి ఏమైనా న్యాయం జరిగేలా ఈ ఫిర్యాదు మీద యాక్షన్ కి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా ఒక వైసీపీ ఎంపీ మీదనే ఈ తరహా ఫిర్యాదు రావడం అది కూడా తమ కుటుంబం ఇబ్బందులో పడింది అని ఒక మహిళ గొంతెత్తి గోడు పెట్టడం అంటే రాజకీయంగా నూ చర్చగానే ఉంది. ఇందులో తప్పు ఎవరిది అన్నది తెలియక పోయినా ఎంపీ మీద వచ్చిన ఆరోపణ మాత్రం అంతా చర్చించుకునేలాగానే ఉంది అంటున్నారు.





