ఏపిని బాగు చేయటం కేసిఆర్ వల్ల మాత్రమే అవుతుంది..ఏపి రాజకీయాలపై మంత్రి మల్లా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Spread the love

జనసముద్రం న్యూస్, జూన్ 05 :

మంత్రి మల్లారెడ్డి. పెద్ద నోరు వేసుకుని తెలంగాణా రాష్ట్రంలోని విపక్షాల మీద బాగానే ఏసుకుంటారు. అది వారి రాజకీయం. ఏదో ఒకటి అనడం నాలుగు తినడం ఓకే. కానీ ఏపీ మీద కూడా మంత్రి మల్లారెడ్డి గారు బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు మూడు సార్లు ఏపీని పట్టుకుని చాలానే పెద్ద మాటలు మాట్లాడేశారు.

లేటెస్ట్ గా అయిన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఆయన కేసీయార్ ని తెగ పొగిడారు. అందులో తప్పూ లేదు విడ్డూరం అంతకంటే లేదు. కానీ ఆయన అదే సమయంలో ఏపీ మీద కూడా విరుచుకుని పడ్డారు. ఏపీలో ఏముంది కులాల రాజకీయమే తప్ప అని ఒక్క లెక్కన కుళ్ల బొడిచారు. ఒకరు కమ్మ లీడరు. ఒకరు రెడ్డి లీడర్ మరొకరు కాపు లీడరు అంటూ కులాల పేర్లతో విమర్శలు చేశారు మినిస్టర్ మల్లారెడ్డి గారు.ఈ లీడర్లు అంతా ఏపీని నాశనం చేశారు తప్ప ప్రజల బాధలను పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఎవరైనా అక్కడ పోలవరం కట్టారా. మా కేసీయార్ తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు అక్కడ ఉక్కు కర్మాగారం కేంద్రం ప్రైవేట్ పరం చేస్తూంటే కాపాడుకోలేని వారు అంటూ గట్టిగానే దట్టించేశారు.

అంతే కాదు కేసీయార్ అయితే సింగరేణిని కేంద్రం నుంచి కాపాడుకుంటున్నారు అని ఇంకా ఎత్తేశారు. ఏపీలో ఏమీ లేదు ప్రజలను బాగుపడనీయని రాజకీయం అక్కడ ఉంది. కేసీయార్ అయితే ఎన్నో పరిశ్రమలను తెలంగాణాకు తెచ్చారని మల్లారెడ్డి చిట్టా విప్పారు. తెలంగాణా యువతకు తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఇస్తే ఏపీ పాలకులు ఏమిచ్చారు అని ఆయన నిందించారు.తెలంగాణాలో ఏ మూల చూసినా ఐటీ కంపెనీలు ఐటీ ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. ఏపీలో మాత్రం బాధలు వ్యధలే అంటూ మల్లారెడ్డి పోలికలు పెట్టి మరీ విమర్శించేశారు. అమెజాన్ గూగుల్ ఫేస్ బుక్ వంటివి తెలంగాణాకు వస్తే ఏపీ మాత్రం ఇబ్బందుల్లో ఉందని అంతున్నారు.

ఏపీని బాగుచేయాలీ అంటే ఒక్క కేసీయార్ వల్లనే తప్ప మరెవివల్లా సాధ్యం కాదని మల్లారెడ్డి బోల్డ్ డైలాగు ఒకటి వదిలారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీయారెస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని జోస్యం కూడా చెప్పేశారు. మొత్తానికి చూస్తే ఏపీకి ఏమీ లేదని కేసీయార్ దిక్కని చెప్పడం కోసం మరో మారు ఏపీ పాలిటిక్స్ మీద ఏపీ పేదరికం అంటూ అస్థిత్వం మీద కూడా  చాలానే అనేశారు.మరి వీటికి జవాబులు ఏపీ మంత్రులు చెబుతారేమో కానీ పదే పదే అంటూ ఉంటే తింటూ ఉండడామేనా. అందులో నిజాలు కూడా కొన్ని ఉన్నాయని తెలుసుకుని ఏపీని బాగుచేసుకోవడం వల్ల కాదా అన్న ప్రశ్నలు సగటు జనాల నుంచి వస్తున్నాయి. తెలంగాణాకు ఏపీ పాలకులు వద్దు అని అంటున్న వేళ ఏపీకి మాత్రం కేసీయార్ కావాలని అక్కడి అమంత్రులు అంటూంటే ఆత్మగౌరవం అయినా ఉండాలి కదా అన్న చర్చ వస్తోంది. మల్లారెడ్డి వంటి వారు మళ్ళీ మళ్లీ అంటూంటే కుళ్ల బొడుస్తూంటే సరిచేసుకోలేని రాజకీయన్ని చూసి ఏమనాలో.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!