మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
జన సముద్రం న్యూస్ జూన్ 03
శనివారం శామీర్ పేట లో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామ కూర మహేందర్ రెడ్డి లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మలక్ పేట లో జరిగిన సమావేశంలో మహేందర్ రెడ్డి బతుకమ్మ, బోనాలతో ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీటీసీ అనితా లాలయ్య , వైస్ ఎంపిపి ఎల్లు సుజాత, డైరెక్టర్ అజయ్ లక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ జహాంగీర్, ఎమ్మార్వో సత్యనారాయణ, జిల్లా ఆర్టికల్చర్ ఆఫీసర్ రేణుక , కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, జిల్లా కోఆప్షన్ మెంబర్ జహీర్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు