బెంగళూరు: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు మన పనిని చాలా రకాలుగా సులభతరం చేశాయి. కానీ సరిగ్గా నిర్వహించకపోతే మనం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కారణంగా మనం సమయం చాలా కోల్పోతున్నాము. అలాంటిది ముంబాయిలో ఓ యువకుడు ఒక్క వీడియో కాల్ కోసం అక్షరాలా ఆరున్నర లక్షలు సమర్పించుకున్నాడు.
ముంబాయి కార్పొరేట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల వ్యక్తికి మార్చి 17న అకస్మాత్తుగా తెలియని నంబర్ నుండి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. యువకుడు కూడా కాల్ రిసీవ్ చేసుకుని చాలాసేపు మాట్లాడాడు. అప్పుడు ఎదురుగా వీడియో కాల్ లో ఒక ఆంటీ మాట్లాడింది. మాట్లాడుతున్నప్పుడు ఆ ఆంటీ అకస్మాత్తుగా తన బట్టలు తీసివేయడం ప్రారంభించింది. నీకు నేను పడక సుఖం ఇస్తానని, మనం అక్రమ సంబంధం పెట్టుకుందామని ఆ యువకుడిని ఆంటీ రెచ్చగొట్టింది.
ఒకానొక సమయంలో కిలాడీ ఆంటీ పూర్తిగా నగ్నంగా నిలబడింది. అంతే మనోడికి షార్వా కారిపోయింది. ఒక క్షణం తడబడిన తరువాత ఆ యువకుడు ఏం చెయ్యాలో తెలీక సతమతం అయ్యాడ. వెంటనే మేడమ్ వీడియో కాల్ కట్ అయ్యింది. కొంతసేపటికి ఆ యువకుడికి మరో తెలియని నంబర్ ఫోన్ కాల్ వచ్చింది.
నగ్నంగా ఉన్న మహిళతో నువ్వు మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది. నువ్వు ఎవడివిరా, నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు. షాక్ తిన్న యువకుడు తనకు వచ్చిన మేడమ్ నగ్న వీడియోను డిలీట్ చేశాడు. మరుసటి రోజు ఆ యువకుడికి మరో గుర్తు తెలియని సెల్ ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్‌ని తీసిన తరువాత అవతలి వ్యక్తి తాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ అని పరిచయం చేసుకున్నాడు.
నువ్వు ఓ యువతితో నగ్నంగా మాట్లాడుతున్న వీడియో తన వద్ద ఉందని, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబోతున్నానని బెదిరించాడు. నీలాంటి వాళ్లతో పెద్ద సమస్య వచ్చిందని బిల్డప్ ఇచ్చాడు. మీ నగ్న వాట్సాప్ కాల్ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకుండా ఉండాంటే తాను చెప్పిన వ్యక్తి రూ. 50 వేల రూపాయలు పంపించాలని చెప్పాడు.
గుర్తు తెలియని ముఠా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని ఆ యువకుడిని బెదిరించింది. అయితే ఆ యువకుడు ఎక్కువ డబ్బులు చెల్లించలేకపోయాడు, అయితే పదేపదే కొందరు ఆ యువకుడిని టార్చర్ పెట్టారు. విసిగిపోయిన ఆ యువకుడు ముంబాయి పరిధిలోని కసర్వాడవాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.