జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఏప్రిల్ 25:
బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ శ్రేణులందరూ… ప్లీనరీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన…
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…
ఈ సమావేశానికి విచ్చేసిన బి ఆర్ఎస్ శ్రేణులందరికీ.. ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి వ్యతిరేక విధానాల గురించి గుత్తా.. మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పథకం … వాటిని బిజెపి ప్రభుత్వం ఆపాలని చూస్తుందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుచేపట్టారని అన్నారు. 24 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కెసిఆర్ శ్రమిస్తున్నారని అన్నారు. పేద ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతూ , అన్ని సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తున్న ఏకైక ప్రభుత్వం బి ఆర్ఎస్ అని తెలిపారు. వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో… గులాబీ జెండాను ఎగరవేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి బి ఆర్ఎస్ శ్రేణులందరికీ… పిలుపునిచ్చి మరెన్నో విషయాలు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజవర్గ,మండలాల బి ఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.