బీజేపీ నేత కు చెందిన పత్రిక,న్యూస్ ఛానెల్ పై కేసిఆర్, బీఆర్ఎస్ అధికారిక నిషేదం..!

Spread the love

జనసముద్రం న్యూస్, మార్చ్ 15 :

తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుగులో టాప్ న్యూస్ చానెల్ తోపాటు ఓ పార్టీకి దగ్గరగా ఉండే మీడియా కేసీఆర్ సహా తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై వెటకారం చేస్తూ ప్రసారం చేసింది. అప్పుడు ఆ రెండు న్యూస్ చానెల్స్ ను నిషేధిస్తూ కేసీఆర్ గట్టి షాకిచ్చారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేగినా వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి మీడియా కూడా కేసీఆర్ విషయంలో కాస్త సంయమనంగానే ఉందన్న టాక్ తెలంగాణ రాజకీయాల్లో ఉంది.

ప్రస్తుతం ఎన్నికలు వస్తుండడంతో ఆయా పార్టీలకు చెందిన మీడియాలు యాక్టివ్ అయ్యి కేసీఆర్ కు వ్యతిరేకంగా బలంగా ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతకు చెందిన ఓ మీడియా కేసీఆర్ పై బీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రసారాలతో హోరెత్తిస్తుందన్న ప్రచారం గులాబీ పార్టీలో సాగుతోందట.. ఇటీవలి కాలంలో తెలంగాణలో పనిచేస్తున్న ఈ బీజేపీ నేతకు చెందిన పత్రిక న్యూస్ చానెల్  సంస్థలు కేసీఆర్ బీఆర్ఎస్ పై మరింత రెచ్చిపోతున్నాయి.ఇటీవల ప్రెస్మీట్ లో  కేటీఆర్ ఆ మీడియా పేరు పిలిచి వాటిని బీజేపీ మౌత్పీస్ అని పిలిచారు. వాటిని “చిల్లర కంపెనీలు” అని కూడా అన్నారు. సమయం వచ్చినప్పుడు వాటిని నిషేధిస్తానని శపథం చేశాడు. ఇప్పుడు అధికారికంగా ఆ పనిచేసినట్టు మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ అధికారికంగా బీజేపీ నేత యాజమాన్యంలోని పత్రిక న్యూస్ చానెల్ రెండింటినీ నిషేధించింది. ఈ రెండు మీడియా పోర్టల్తో ఇంటరాక్ట్ చేయవద్దని కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ తమ నేతలను ఆదేశించింది. సంబంధిత ఉత్తర్వులను బీఆర్ఎస్ ప్రతినిధులందరూ ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. బీఆర్ఎస్ – వారి పార్టీ కార్యకర్తలపై ఇదివరకు చెడుగా మాట్లాడినందుకు రెండు టాప్ న్యూస్ చానెల్స్ ను  టీఆర్ఎస్ గతంలో నిషేధించింది. ఇప్పుడు మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ చానెల్ పై నిషేధం విధించడం గమనార్హం.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి ఫేవర్ గా ఉంటున్న ఆ పత్రిక న్యూస్ చానెల్ ను నిషేధించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గులాబీ పార్టీ ఇప్పటికే బీజేపీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. ఈ పరిణామం దానికి ఊపునిస్తుంది.

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!