జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 13 :
దేవరకొండలో జరిగిన నల్లగొండ జిల్లా వీఆర్ఏ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పల్లా ప్రవీణ్ కుమార్ ను నల్గొండ విఆర్ఏ జేఏసీ జిల్లా కో చైర్మన్ గా మరియు బొజ్జ లక్ష్మీశ్రీనివాస్ ను జిల్లా కో కన్వీనర్ గా నియమిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ దాదేమియా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..
వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వం ఇచ్చిన మూడు హామీలు అయిన పే స్కేల్, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, జీవోలు వచ్చేవరకు ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు. అదేవిధంగా తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.