మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 11
అడవిలో ఉన్న మూగజీవాలైన వానరులకు ఆహార అందివాలనే సదుద్దేశంతో ఫీడ్ మంకీస్ మంకీస్ అనే నినాదంతో గత 57 నెలల నుండి మల్కాజ్గిరి కి చెందిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ప్రతినెలా ఒకరోజు నరసాపూర్ అడవిలో ఉన్న వానరులకు ఆహార అందిస్తున్నారు. అయితే గ్రూప్లో కొంతమంది సభ్యులు నెలకు ఒకసారి కాకుండా మూడు నాలుగు రోజులు వానరులకు ఆహారం అందించాలని సూచించి ముందుకు రావడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రూప్ సభ్యులు మధుమోహన్,లయన్ హనుమంతరావు,చిన్నస్వామి ల సహకారంతో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు అరటి పండ్లు క్యారెట్, బ్రెడ్ వానరులకు ఆహారంగా అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, శ్రీనివాస్, శంకర్, భాను,తదితరులు పాల్గొన్నారు.