జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 10:
ఫిబ్రవరి 10న మిర్యాలగూడ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో ముఖ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు, తెలంగాణ రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షులు గాజుల పున్నమ్మ, నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి కృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు చేతుల మీదుగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా “తాళ్లపల్లి రమేష్ “ను మాల మహానాడు సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి చేతుల మీదగా “తాళ్లపల్లి రమేష్ “కి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సమస్యలపై అనునిత్యం “జాతి కోసం” పనిచేయాలని, కేజీ టు పీజీ అయ్యేవరకు విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు విద్యార్థి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షులు గుండాలు, మహిళా మండ లి అధ్యక్షులు పున్నాల నాగమ్మ మాట్లాడుతూ.. దళిత బంధు లో “మాలలకు ” రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన న్యాయం చేయాలన్నారు.
మహిళలపై అనునిత్యం జరుగుతున్న అత్యాచారాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని నిందితులకు కఠిన శిక్షలు చేయాలని తెలిపారు. “మహిళలపై “జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటాల కొరకు మహిళా విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేస్తామని పు న్నాల నాగమ్మ తెలిపారు.
ఈ సమావేశంలో వీరితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పలి నాగేష్, జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు నాగు, జోసెఫ్.. లు, మాల మహానాడు నాయకులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలనాయకులు.. లు, తదితరులు పాల్గొని ఏకగ్రీవంగా నియమితులైన “తాళ్లపల్లి రమేష్ “కు శుభాకాంక్షలు తెలిపారు.