జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 10:
ఫిబ్రవరి 10న మిర్యాలగూడ పట్టణంలో ని రవీంద్ర నగర్ లో రైల్వే స్టేషన్ కు వెళ్ళు దారికి సిమెంటు రోడ్డు వేసినందుకు మరియు సిమెంట్ రోడ్డు ప్రక్కల మట్టిని పోసి రోడ్లపై నడిచే ప్రజలకు,వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు కాలనీ ప్రజలు మిర్యాలగూడ ఎమ్మెల్యే “నల్లమోతు భాస్కర్ రావు “కు కృతజ్ఞతలు తెలిపారు,
రవీంద్ర నగర్ కాలనీ లో కాల్వల ద్వారా మురుగునీరు పోవడానికి కల్వర్టు నిర్మించాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు వచ్చేలా చేయాలని , మునిసిపల్ చెత్త బండి వాహనాన్ని కాలనీలో ని అన్ని వైపులా తిప్పి చెత్తను సేకరింపజేయాలని తదితర పలు సమస్యలను” రవీందర్ నగర్ కాలనీ వాసులు” మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు విన్నవించుకున్నారు. ఇంతే కాకుండా కాలనీలో
వీధి దీపాలు వెలగడం లేదని రాత్రిపూట చీకటిగా ఉండి కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్,, రవీంద్ర భారతి స్కూల్ కరస్పాండెంట్ కందుల మధుసూదన్ రెడ్డి, ఎలమంచిలి శ్రీనివాసరావు బ్రహ్మచారి జగన్ శ్రీను రఘు రాజు పరమేష్ బెనర్జీ గోపాల్ మట్టయ్య తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.