ఈ నెల 11 నుంచి ఇంటింటికి జగన్ బొమ్మతో స్టిక్కర్లు..!!

Spread the love

జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09

ప్రతీ ఇంటికీ ఒక స్టిక్కర్. ఇది లేటెస్ట్ గా వైసీపీ ఎంచుకున్న సరికొత్త వ్యూహం. వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రెట్టింపు అన్న మాట. అలాగే అదనం అన్న మాట. వాలంటీర్ల ద్వారా గత నాలుగేళ్ళుగా ఏపీలో జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. పెన్షన్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారానే జరుగుతున్నాయి.దాంతో ఇపుడు ప్రతీ యాభై కుటుంబాలకు వాలంటీర్లు బాగా పరిచయమైపోయారు. ఒక విధంగా వారికి ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో కూడా కచ్చితమైన ఐడియా ఉంది. ఇంటి వారు సైతం తమకు ఏదైనా పధకం రాకపోతే వారినే అడుగుతున్నారు. ఇలా ఒక రకమైన బంధాన్ని వేసిన వైసీపీ ఇపుడు ఇదే వాలంటీర్లను ఉపయోగించుకుని గృహ సారధులు అనబడే ఇద్దరు పార్టీ ప్రతినిధులను నేరుగా పరిచయం చేయబోతోంది.

వాలంటీర్లు ప్రభుత్వ పక్షాన ఉంటే గృహ సారధులు పార్టీ పక్షాన ఉంటారు అన్న మాట. రేపటి ఎన్నికల్లో ఓట్లను వీరు పోలింగ్ బూత్ లలో వేయించేందుకు అన్నట్లుగా వైసీపీ వారిని ఒక సైన్యంగా మార్చాలనుకుంటోంది. ఇలా ప్రతీ యాభై ఇంటికి ఇంద్దరు అంటే కచ్చితంగా పాతిక ఇళ్ళకు ఇకరు ఉంటారు అన్న మాట. ఆ ఇంట్లో కనీసం నలుగురు మెంబర్స్ వేసుకున్నా వంద మందికి ఒకరు అన్నట్లుగా వైసీపీ తన పార్టీ ఓట్ల కోసం మనిషిని నియమించుకుంటోంది.అయితే పధకాలను అందుకోవడం వేరు. వాటి ఫలితాలను ఓట్ల రూపంలో చెల్లించడం వేరు. సరిగ్గా ఇక్కడే వైసీపీ కొత్త ఆలోచన చేసింది. పధకాలు ఇచ్చేది వాలంటీర్. వారితో ఆయా కుటుంబాలకు మొహమాటాలు ఉంటాయి. దాంతో వారిని వెంటబెట్టుకుని గృహ సారధులు ఆ ఇంటికి టచ్ లోకి వెళ్తారు మా నమ్మకం నీవే జగన్ అన్న స్టిక్కర్లను గృహ సారధులు ఆయన ఇంటికి అతికిస్తారు. అయితే ఇంటి యజమాని అంగీకారంతోనే ఇది అని అంటున్నారు.

కానీ ఆ ఇంటి యజమాని నో చెబితే అపుడు సంగతేంటి అంటే ఇక్కడే వైసీపీ మార్క్ వ్యూహం ఉంది అని అంటున్నారు. అదెలా అంటే ఆ ఇంటికి అందుతున్న సంక్షేమ పధకాలు వాలంటీర్ ఏకరువు పెట్టి ఇన్ని పథకాలు అందుకుంటున్నరు కదా జగన్ మీ నమ్మకం అయితే స్టిక్కర్ అతికించుకోవడంలో అభ్యంతరం ఎందుకు అని అడుగుతారు. ఇక ఎన్నికలకు ఏడాదికి పైగా వ్యవధి ఉంది. దాంతో కచ్చితంగా పధకాల కోసం అయినా చాలా మంది తన ఇంటి గోడకు వైసీపీ స్టిక్కర్ అతికించుంటారు. అంటే ఒక విధంగా బలవంతంగా కూడా ఈ స్టిక్కర్లు అతికింపు జరుగుతుంది అని అంటున్నారు

ఇక ఇక్కడ వారితో డైలీ గృహ సారధులు టచ్ లో ఉంటూ పార్టీ గురించి ప్రచారం చేస్తారు అన్న మాట. దీని వల్ల వైసీపీకి ఒక కచ్చితమైన సమాచారం కూడా వస్తుంది అని అంటున్నారు. అదెలా అంతే ఎవరు స్వచ్చందంగా తమ ఇంటికి స్టిక్కర్లు అతికించుకుంటున్నారు అన్న డేటా వారికి దొరుకుతుంది. ఏపీలో మొత్తం కోటీ అరవై లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం అంటే కోటికి పైగా కుటుంబాలకు వైసీపీ పధకాలు ఇస్తోంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభిమానులు ఉన్నారు.ఇపుడు ఇందులో నుంచి నిఖార్సు అయిన వైసీపీ అభిమానుల డేటా బయటకు వస్తుంది. అలాగే పార్టీలకు అతీతంగా పధకాలు ఇస్తున్నారు కాబట్టి ఆ వైపు ఉన్న వారు ఈ వైపునకు వస్తారని కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ వారు టీడీపీ అని తేలితే వారిని ఈ వైపునకు లాగే విషయం కూడా గృహ సారధుల ద్వారా చేస్తారు.

ఈ విధంగా  చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని కుటుంబాలు అండగా నిలుస్తాయి అన్నది తేల్చేసేలా ఈ స్టిక్కర్ల అతికింపు కార్యక్రమం ఉండబోతోంది అని అంటున్నారు. మొత్తానికి ఇది వైసీపీకి కూడా ఒక సవాల్ గా ఉంటుంది అని అంటున్నారు. అన్ని ఇళ్లకు జగన్ బొమ్మతో స్టిక్కర్లు అతికిస్తే విపక్షాలు చూస్తూ  ఊరుకుంటారా అన్న చర్చ కూడా ఉంది.ఇక ఏపీలో చూస్తే కొత్తగా వచ్చిన ఓటర్ల జాబితా ప్రకారం నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా తమ వైపు ఉంటే బే ఫికర్ గా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నది వైసీపీ ఆలోచనగా ఉంది. అందుకే కోటి కుటుంబాలను అయినా టార్గెట్ చేసే విధంగా ఈ స్టిక్కర్ల ప్రొగ్రాం డిజైన్ చేశారు అని అంటున్నారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం అయ్యే ఈ ప్రొగ్రాం ఎలా సాగుతుందో చూడాల్సిందే.

Related Posts

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, ఏపీ, డిసెంబర్ 12. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి 17న ఫస్ట్ లాంగ్వేజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు