- కొల్చారం సర్పంచ్ ఉమా రాజా గౌడ్….
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 9
కంటి సమస్యలు, దృష్టిలోపం ఉన్నవారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రమేష్, కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమా రాజా గౌడ్ అన్నారు. మండల కేంద్రమైన కొల్చారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ కరెంటు ఉమా రాజా గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ 14 రోజులపాటు కొల్చారంలో కంటి వెలుగు శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 1850 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. 218 మందికి రీడింగ్ గ్లాసులు అందజేయడం జరిగిందన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. నిరుపేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేయడం, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి బీపీ , షుగర్ పేషెంట్లకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం, కెసిఆర్ కిట్… ఇలా ఎన్నో ఆరోగ్య పథకాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శైలేంద్ర, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, కారోబార్ ప్రభాకర్, ఏపీఎం సుసిల్వా, అంగన్వాడి టీచర్లు శివమ్మ, నీరజ, మేఘమాల, స్వరూప, సిబ్బంది సంగీత, జ్యోతి, ప్రవీణ, ఆశ వర్కర్లు రాణి, కవిత, సబిత, రాములమ్మ, చంద్రకళ, నాగమణి, తదితరులున్నారు.