జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 3 :
మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో ఉన్న ఓల్డ్ “ఏపీజీవీబీ బ్యాంకు “దగ్గర శుక్రవారం, ఫిబ్రవరి 3వ తేదీన మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెగిడాల సురేష్ టూ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి వెహికల్స్ ను చెకింగ్ చేస్తుండగా ఆ రహదారిలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకి ల్ యొక్క డ్రైవర్స్ అతివేగంగా మరియు ఆ జాగ్రత్తగా పబ్లిక్ స్థలములో “ప్రజల ప్రాణాలకు” అపాయం కలిగించే విధంగా నడుపుతూ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ కి ఉన్న కంపెనీ సైలెన్సర్ ను తీసేసి పెద్దగా శబ్దం వచ్చే వేరే సైలెన్సర్ ను మోటార్ సైకిల్ కి అమర్చి రోడ్లపై జనాలకు ఇబ్బంది కలిగే విధంగా తిరుగుతుండగా ఎన్. సురేష్ మరియు టూ టౌన్ పోలీస్ సిబ్బంది కలిసి మోటార్ వెహికల్, డ్రైవర్స్ ను పట్టుకొని మోటార్ వెహికల్ డ్రైవర్స్ పై కేసు నమోదు చేసి,మోటార్ సైకిల్ ను సీజ్ చేసి సంబంధిత కోర్టుకు పంపడం జరిగింది.
మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెగిడాల సురేష్ మాట్లాడుతూ.. వాహనదారులు వాహనములకు సంబంధించిన అన్ని పత్రములతో వాహనములను రోడ్లపై సంచరించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా నడపాలని ఎన్. సురేష్ తెలిపారు. రోడ్లపై వాహనదారులు ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా వాహనం నడిపితే వాహనదారులకు కఠిన చర్యలు తప్పవని మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ‘నెగిడాల సురేష్’ హెచ్చరించారు.