జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలి

Spread the love
  • మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా….
  • మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్ )ఫిబ్రవరి: 3:
  • ఏడుపాయల జాతర ఉత్సవాలకు సమయం తక్కువగా ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తమకు అప్పగించిన పనులను శరవేగంగా పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఆర్డీ ఓ సాయి రామ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి , సంబంధిత అధికారులతో కలిసి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ నీరు కలుషితం కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 10 న ట్రయల్ గా నీటిని వదలాలని , తిరిగి జాతరకు 15 న 0 .450 టిఎంసిల నీటిని వదలాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. పోతంశెట్టిపల్లి వద్ద ట్రాఫిక్నియంత్రణ, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్ , రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. చౌరస్తా వద్ద ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ ను గుర్తించి శాశ్వత ప్రాతిపదికన దేవాదాయ శాఖ ద్వారా బస్టాండు నిర్మాణానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు. బఫర్ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలన్నారు.

  • జాతరకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అసైన్డ్ భూములు ఉపయోగించుకొని పార్కింగ్ ఏర్పాటు చేయాలని, సుదూర ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో బస్టాండు నుండి ఆలయం వరకు ఉచితంగా మినీ బస్సులు, ఆటో సౌకర్యం కల్పించాలన్నారు. పోతన్ శెట్టి పల్లీ వైపు బస్టాండ్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు షామియానాలు, త్రాగు, మరుగు దొడ్లు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చెలిమెల కుంట వద్ద రోడ్డుకు ఇరుప్రక్క వాహనాల పార్కింగ్ వద్ద రోడ్డు ఇరుప్రక్కల బారికేడ్లను ఏర్పాటు చేయాలని ప్రైవేట్ వాహనాలు జాతరలోనికి అనుమతించ వద్దని, వీఐపి వాహనాలకు ప్రత్యేక వాహనాల అనుమతుల పాస్ లను కేటాయించాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద త్రాగునీటి కొళాయిలను ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ను ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల ను ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకొని చెత్త చెదారాన్ని తరలించాలని సూచించారు. జాతర పరిసర ప్రాంతాలతో పాటు నది పరివాహక ప్రాంతాల ఇరుప్రక్కల ఎల్ ఈ డి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, మూడు బ్రిడ్జిల వద్ద బ్యారికేడింగ్, పోలీసులు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, 5 ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుకోవాలని, అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోసిన జాతర అనంతరం చెత్తను తరలించేవిదంగా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. అటవీలో అగ్ని ప్రమాదాలనివారణకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బంది ఫోన్ నంబర్ కు సమాచారం అందివ్వాలని సూచించారు. బస్టాండ్,పార్కింగ్, నిర్మాణంలో ఉన్న దుకాణాల సముదాయాలను, ఘనపూర్ ఆనకట్టను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. వచ్చే జాతర నాటికి శాశ్వత ప్రాతిపదికన మరిన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. షవర్లు, మంచి నీటి కుళాయిలు పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టి జాతర నాటికి అందుబాటులో సిద్ధంగా ఉంచాలన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన వసతులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
    అనంతరం వన దుర్గా భవాని మాత ను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వీరికి ఆలయ పాలక మండలి చైర్మన్ బాలా గౌడ్, ఇఓ శ్రీనివాస్ లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
    ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ ఈ శ్రీనివాస్, డిపీ ఓ , సాయిబాబ, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈ ఈ పాండు రంగారెడ్డి, మిషన్ భగీరథ అధికారి కమలాకర్ , మత్స్య శాఖా సహాయ సంచాలకులు రజిని , తహసీల్ధార్లు మహేందర్, చంద్రశేఖర్, డిఎస్పీ సైదులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు