
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, ఫిబ్రవరి 2 :
మిర్యాలగూడ నియోజకవర్గం ను “ప్రత్యేక నూతన జిల్లా” గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో ని చర్చిరోడ్ వద్ద ఉన్న ‘ కే ఎల్ ఎన్ జూనియర్ కాలేజ్ ‘,విద్యార్థుల వద్దకు వెళ్లి మిర్యాలగూడ ను ప్రత్యేక నూతన జిల్లా ఏర్పాటు కొరకు విద్యార్థులందరూ సహకరించాలని, మిర్యాలగూడ నియోజకవర్గం “జిల్లాగా ఏర్పడితే” వచ్చే లాభా లు, ‘ఉద్యోగ అవకాశాలు’ గురించి విద్యార్థులకు బంటు వెంకటేశ్వర్లు అవగాహనా కల్పించడం జరిగింది. విద్యార్థులందరు “ప్ల కార్డ్స్ “తో మిర్యాలగూడ ‘నూతన జిల్లా’ కొరకు తమ వంతు మద్దతు తెలపడం జరిగింది. మిర్యాలగూడ జిల్లాగా ఏర్పడితే చదువుకునే విద్యార్థులకు మేడికల్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పడతాయని కే ఎల్ ఎం కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు వివరంగా తెలపడం జరిగింది. , రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన అన్ని వనరులు, సహజసంపదలు, ఆర్థికంగాను, బౌగోలికంగాను చుట్టూ వైశల్యాపారంగాను “సకల అర్హతలు” ఉన్నటువంటి మిర్యాలగూడ నియోజకవర్గం ను తక్షణమే ‘నూతన జిల్లా ‘గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి ప్రకటించాలన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు తో పాటు విద్యార్థులు ::మణికంఠ, నరేష్, కిరణ్, వెంకటసాయి, యశ్వంత్, వేణు, సాయిచరణ్, శరత్, రేవంత్, భాస్కర్, సాయితేజ, యుగేందర్.. లు, తదితర విద్యార్థులు పాల్గొని మిర్యాలగూడను రాష్ట్ర ప్రభుత్వం మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని కోరారు.





