జనసముద్రం న్యూస్, గూడూరు, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, జనవరి 29:
29వ తేదీ ఆదివారం రోజున తెల్లవారు జామున గూడురు గ్రామ పరిదిలో కారు యాక్సిడెంట్ జరిగింది.
కారు యాక్సిడెంట్ కు కారణాలు ఏమిటంటే..
హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆంధ్ర వైపుకు కారు నడుపుతూ ఉండగా మిర్యాలగూడ మండలం గూడురు గ్రామపంచాయతీ పరిధిలో హైవే రోడ్డు పక్కన మట్టి ది బ్బలను ఎక్కించి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పోలును కారు ఢీ కొట్టడం జరిగింది. కారు ఢీకొనడంతో బెలిన్ కారులో ఉన్న ముందు భాగం కారు నడుపుతున్న డ్రైవర్ కు చిన్న గాయాలతో బయటపడగా , కారులో వెనుక భాగం కూర్చున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, ఒక మహిళ నడుము భాగం కు , ఇతర గాయాలు అయ్యాయని ఇ క్కడి స్థానికులు తెలిపారు. కారు యాక్సిడెంట్ అయిన క్షత గాత్రులను అంబులెన్స్ లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ కారులో ఉన్న వారి గురించి మిర్యాలగూడ రూరల్ పోలీస్ వారికి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.