జన సముద్రం న్యూస్, మాడుగుల పల్లి, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 20:
విద్యాశాఖలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న ప్రతి పోస్ట్ లో 10% రిజర్వేషన్ అమలుపరిచేలా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మాడుగులపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోతూ దశరథ నాయక్ మాట్లాడుతూ క్యాడర్ స్ట్రెంత్ తో సంబంధం లేకుండా పదోన్నతి కల్పించునున్న ప్రతి పోస్టులో గిరిజన రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ లో అవకాశం కల్పించాలని కోరారు. కొత్త రోస్టర్ ప్రకారం పదోన్నతిలో రిజర్వేషన్ అమలుచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కచ్చితంగా రిజర్వేషన్ అమలు పరిచేలా రాష్ట్రంలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశామని, బంజారా ఉద్యోగ సంఘం సూచనను దృష్టిలో పెట్టుకొని మరోసారి విద్యాశాఖ అధికారులకు తగు చర్యల నిమిత్తం ఆదేశిస్తామని అన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో డివిజనల్ డిప్యూటీ స్టాటికల్ అధికారులు లస్కర్ నాయక్,కిషన్ నాయక్ బంజారా ఉద్యోగ సంఘం నాయకులు శంకర్ నాయక్,పంతులు నాయక్, లాలూ నాయక్ తదితరులు ఉన్నారు.