జన సముద్రం న్యూస్, అనంతపురం, జనవరి 13:
ఇదేం కర్మ రాష్ట్రానికి గోడ పత్రిక విడుదల
త్వరలో జిల్లా వ్యాప్తంగా చంద్ర దండు ఆధ్వర్యంలో పెద్ద యెత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన
రాష్ట్రం లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఇదేం కర్మ రాష్ట్రానికి గోడ పత్రికలు బెస్త నారాయణ స్వామి ఆధ్వర్యంలో లో చంద్ర దండు ప్రకాష్ నాయుడు గారి చేత ఆవిష్కరణ చేశారు.రాష్ట్రంలో ఏ వర్గంలో చూసిన అసంతృప్తి ఉద్యోగులపై చిన్న చూపు నిరుద్యోగులను అసలు పట్టించుకోని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజానీకం స్తబ్దంగా ఉంది.జీవో నెంబర్ ఒకటి బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని అమలు చేసి కనీసం దహన సంస్కారాలకు వెళ్లాలన్న ఈ జీవో నెంబర్ ను అడ్డంపెట్టి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వైఎస్ఆర్సిపి నాయకులు చేతిలో కబంధహస్తాలుగా ప్రజలను ప్రతిపక్ష పార్టీలను వేధిస్తున్నారు.కుటుంబ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిమిత్తం అలాగే లోకేష్ బాబు గారు త్వరలో చేపట్టబోయే యువగళం కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలని దురుద్దేశంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను పోలీసులు చే బలవంతంగా అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడు.
ఇక నిరుద్యోగుల విషయానికొస్తే పది సంవత్సరం కొత్త క్యాలెండర్ ఏ విధంగా వస్తుందో అలాగే జాబ్ కాలనీ కూడా వదులు అని మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి కనీసం నీకు సిగ్గు శరం ఉందా.. ఇటీవల రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసే విధంగా అరకొర పోస్టులను భర్తీ చేయడం చాలా దిక్కుమాలిన చర్య ఒక కానిస్టేబుల్ పోస్టులకు వస్తున్న అప్లికేషన్లు చూస్తుంటే ఇంటర్మీడియట్ అర్హతగా ఉన్న పోస్టులకు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నత విద్యావంతులు బీఈడీ లో ఎంఏఎంఎస్లు పీజీలు పీహెచ్డీలు ఎన్నో రకాల ఉన్నత విద్యా అభ్యసించినటువంటి నిరుద్యోగులు అప్లై చేస్తున్నారంటే మన రాష్ట్రం లో నిరుద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఇప్పటికైనా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను పెంచి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని ఈ ప్రభుత్వము డిమాండ్ చేస్తున్నాను అనిచంద్ర దండు ప్రకాష్ నాయుడు తెలిపారు.
గడపగడప కార్యక్రమంలో విజయవాడ అమరావతి ప్రాంతంలో దేవినేని అవినాష్ చేపట్టిన కార్యక్రమంలో ఒక మహిళ తమ కుటుంబానికి పింఛన్లు రావడం లేదని అలాగే పారి సిద్ధం పై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సిపి మహిళా కార్యకర్తలను అక్కడ స్థానిక నాయకులు ఆ మహిళ ఇంటికి పంపి కళ్ళల్లో కారంపొడి చల్లి వారి కుటుంబం పై దౌర్జన్యం చేశారు ఇలాంటి సంఘటనలు పోలీసులకు కనబడవా వెంటనే ఆ మహిళలకు న్యాయం చేయాలి అని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రతి గడపకు తీసుకెళ్తామని అలాగే ఒక్క ఛాన్స్ అని సినిమా డైలాగులు చెప్పుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన బిక్షతో కుటుంబం అంతా నాటకాలు ఆడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తన నిజ స్వరూపం బయటపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను పీక్కు తింటున్నాడు త్వరలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని తెలిపారు – లక్ష్మీ నాయుడమ్మ.
సైకో పాలన పోవాలి సైకిల్ పోవాలని రావాలి ఇదేం కర్మ రాష్ట్రానికి గోడపత్రికలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలకు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితో ఉంది బాబు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ అని బెస్త నారాయణస్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంద్ర దండు ప్రకాష్ నాయుడు-ap మాంస అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్,
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మహిళా నాయకురాలు లక్ష్మీ నాయుడమ్మ, చల్ల ఉమా, చంద్ర దండు జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ నాయుడు,బెస్త నారాయణస్వామి- తెలుగుదేశం సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు,
చంద్ర దండు నాయకులు పరిమి చంద్రశేఖర్ నాయుడు, మాలపాటి జగన్నాథ్, సంగా ఫణి భూషణ్ పాల్గొన్నారు.