జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 13:

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండలం లోని గాంధీ నగర్, శాంతి నగర్, గణేష్ పహాడ్ గ్రామాలకు “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం”ద్వారా సుమారు 60 లక్షల రూపాయల నిదులతో నూతన గ్రామ పంచాయతి భవనాలకు, మరియు 18 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు “స్పెషల్ డెవెలప్ మెంట్ ఫండ్ గ్రాంట్ల” ద్వారా మండలంలోని గ్రామానికి 20 లక్షల చొప్పున మొత్తం మంజూరు అయిన సుమారు 3 కోట్ల 60లక్షల రూపాయల నిధులతో దామరచర్ల మండలంలో గ్రామాలైన.. కొండ్రపోల్, పార్థు నాయక్ తండా, బండవాత్ తండా, రాళ్లవాగు తండా, బొల్లిగుట్ట తండా,బెట్టే తండా, వాచ్య తండా, బొత్తల పాలెం, గాంధీనగర్,తిమ్మాపురం, తూర్పు తండా, పుట్టలగడ్డ, శాంతినగర్, నర్సాపురం,దామరచర్ల, గణేష్ పహాడ్, తాళ్ల వీరప్ప గూడెం, ఇర్కి గూడెం గ్రామాల నందు నూతన సీసీ రోడ్ల నిర్మాణశంకుస్థాపన కార్యక్రమాలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు.
శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ ..

పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం నేను అహర్నిశలు శ్రమిస్తానని భాస్కర్ రావు తెలిపారు. ఇంతే కాకుండా పల్లెల అభివృద్ధి కోసం ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు , గ్రామ ప్రజలు తమ వంతు కృషి చేయాలని ఇంకా మరెన్నో విషయాలు భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు తో పాటు దామరచర్ల మండల ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజ, వైస్ ఎంపీపీ కటికం సైదులు రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గేం పూడి నారాయణరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు కుందూరు వీర కోటిరెడ్డి, జెడ్పిటిసి అంగోతు లలితా హతి రామ్, మండల ఎంపీటీసీలు.. బాల సత్యనారాయణ, సోము సైదు రెడ్డి.. లు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లావురి మేఘ్య నాయక్, మైనారిటీ నాయకులు.. యూసఫ్.. లు, పడిగా పాటి పెద్ద కోటిరెడ్డి, మండల గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, మండల కోఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, బి ఆర్ఎస్ నాయకులు, అభిమానులు, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు మండలంలోని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు





