జనసముద్రం న్యూస్, తొర్రూరు ,పాలకుర్తి , జనవరి 09:

12వ తారీకున మహబూబాబాద్ జిల్లాలో జరిగే తెలంగాణ ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పెద్ధవంగర మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మండల పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ ఇంచార్జిలు మరియు ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈదురు ఇళయ మాట్లాడుతూ ఈ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్దవంగర మండలనికి సంబందించిన అభివృద్ధి పనుల గురించి సీఎం కేసిఆర్ కు వివరించడం జరుగుతుందనీ… సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం, వివిధ అభివృద్ధి కార్యక్రమల పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు. పెద్దవంగర మండలంలోని అన్ని గ్రామాల నుండి మండల, గ్రామ ముఖ్య నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతు కోఆర్డినేటర్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, బూత్ కమిటీ కన్వినర్లు, కో-కన్వినర్లు, బూత్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, మహిళాలు అందరు సకాలంలో హాజరై గౌరవ సీఎం కెసీఆర్ సభ ను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్య శర్మ, మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమరెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ వైస్ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్, మండల పార్టీ ఉపాధ్యక్షులు, పీఎసిఎస్ డైరెక్టర్ బానోత్ వెంకన్న, కనుకుంట్ల వెంకన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, మండల నాయకులు శ్రీరాం సుదీర్, బొమ్మేరబోయిన రాజు, దుంపల సమ్మయ్య, మండల ప్రచార కార్యదర్శి పసులేటి వెంకట్రామయ్య, మండల ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు ఎదునూరి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, రైతు కోఆర్డినేటర్ టి. మల్లికార్జున చారి, పాలకేంద్రం చైర్మన్ రాసాల సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు బోనగిరి లింగమూర్తి, కుకట్ల వీరన్న,మండల మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎం ఎండీ. ఇబ్రహీం, పడమటి తండా యూత్ అధ్యక్షులు బానోత్ మైబు,యూత్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.





