జనసముద్రం న్యూస్,జనవరి
రైతు అభివృద్ధే లక్ష్యంగా మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వై.యస్.ఆర్ జలకళ పథకంలో భాగంగా పేద రైతన్నలకు ఉచిత బోరు బావుల తవ్వకం మరియు ఉచిత మోటరు పంపుసెట్ల పంపిణీ కార్యక్రమంను నేడు మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం యర్రగుంట గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు ప్రారంభించడం జరిగింది.
YSR జలకళలో భాగంగా ఇది వరకే రాష్ట్ర వ్యాప్తంగా 17,970 మంది అర్హులైన రైతన్నలకు పొలాల్లో బోర్లు వేయించడం జరిగింది.
ఇందులో భాగంగా నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గం యర్రగుంట గ్రామంలో శ్రీమతి బోయ మంజులమ్మ అనే సన్నకారు మహిళా రైతుకు రూ 1,93,000 /- లతో మంజూరు అయిన మోటరు పంపు సెట్ ను నేరుగా ఆ మహిళా రైతు పొలంలోకి వెళ్లి మోటర్ పంప్ సెట్‌ను పంపిణీ చేసి మోటరును ప్రారంభించిన అనంతరం యర్రగుంటలో నిర్వహించిన సభలో పాల్గొని రైతన్నలకు మోటరు సెట్లను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు”
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం.. మన జగనన్న ప్రభుత్వంలో రైతుల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా YSR జలకళ లో భాగంగా అర్హులైన 13,197 మంది సన్నకారు రైతులుకు గానూ 198.00 కోట్లు వ్యయంతో మోటరు పంపు సెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు.
అదేవిధంగా అనంతపురం జిల్లాలోని 1,935 మంది రైతులకు గానూ 30 కోట్లు ,కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 293 మంది రైతులకు 4.5 కోట్లు లబ్ధిని చేకూరుస్తూ పంపిణీ చేయడం జరిగింది అని తెలియజేశారు.





