జనసముద్రం న్యూస్,జనవరి 7:
సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి తనకు పాఠాలు బోధించే ఓ ఉపాధ్యాయురాలి పట్ల వికృతంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతుండగా వెనుక వైపు నుంచి ఆమె వీడియో తీశాడు. దానికి అశ్లీల పాట జోడించి ఇన్ స్ట్రామ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన పలువురు హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుగంచిప్రోలు మండలంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన గాడి తప్పింది. ఈ పాఠశాల విద్యార్థులు గతంలోనే అనేక సార్లు వికృత చేష్టలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలున్నాయి.అయితే తాజాగా ఓ తొమ్మిది తరగతి విద్యార్థి పాఠశాల తరగతిలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండగా వెనుక వైపు నుంచి సెల్ ఫోన్లో రికార్డు చేశాడు.
ఈ వీడియోకు ఒక అశ్లీల పాటను జోడించి ఇన్ స్ట్రాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను చాలామంది చూడటంతో విషయం మొత్తం ఊరంతా పాకిపోయింది. ఈ సంఘటనపై హెచ్ఎం గురువారం స్పందించి సదరు విద్యార్థి తండ్రికి బడికి పిలిపించారు. మా పాఠశాలలో మీ కొడుకు వద్దు.. టీసీ తీసుకొని వెళ్లిపోండి అంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.అయితే విద్యార్థి తండ్రి మాత్రం ఈ ఒక్కసారిగా వదిలేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. కాగా ఈ సంఘటనతో పాఠశాల ఉపాధ్యాయునులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలకు మొదట్లోనే చెక్ పెట్టాలని లేదంటే ఒకరిని చూసి మరొకరు ఇలాంటివి చేసే అవకాశం ఉంటుందని హెచ్ఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Alanti vadini kotti champali chilar nakoduku
In every school teacher have to ask girls if any problem is there or not. Only lady teacher to girls. For girls main problem that pass or failed give to lady teacher.