జనసముద్రం న్యూస్,జనవరి 7:
తెలంగాణలో కామారెడ్డి కలెక్టరేట్ ఉద్రికత్తలకు కారణమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ పోలీస్ కేసు నమోదు చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించినందుకు బండి సంజయ్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ప్రజా ఆస్తి చట్టం 147148353323290341427149 సెక్షన్లతో సహా 11 సెక్షన్ల కింద కామారెడ్డి స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కలెక్టరేటును బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలు ముట్టిడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు గేటు దూకి కలెక్టరేట్ లోపలికి దూసుకెల్లడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు.మరోవైపు బండి సంజయ్ అరెస్టును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీస్ వాహనం అద్దాలు పగులకొట్టారు. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడంతోపాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేసినందుకు బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను రాత్రికి రాత్రే పోలీసులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించాలని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే మాస్టర్ ప్లాన్లో భూమి కోల్పోయినందుకు ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబానికి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు మాస్టర్ ప్లాన్పై రైతులు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జనవరి 9న విచారణ జరుగుతుంది.
కాగా వచ్చే 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఓటు లిస్ట్ ను ప్రతి ఒక్కరూ తనిఖీ చేసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. 22 నోటిఫికేషన్ ల ఇచ్చినా 20 వేల ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్ర నిధులపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని కేటీఆర్ కు సవాల్ విసిరారు. రాజీనామ పత్రం పట్టుకొని కేసీఆర్ ను రమ్మను అంటూ సవాల్ విసిరారు