- ఉద్యమాన్ని ఆపేది లేదు జెసి ఉద్యమ కమిటీ సభ్యుల డిమాండ్….
- మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:7
- ఐఎంఎల్ డిపోలో హమాలి పని కల్పించాలంటూ గత మూడు నెలల నుంచి డిపో ముందు జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో శనివారం నాడు ఐఎంఎల్ డిపో ముందు శాంతియుతంగా రిలే నిహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నాలుగు నెలల క్రితం ఐఎంఎల్ డిపోలో ఒక్క అమాలి పోస్టు 60 లక్షల పదివేల రూపాయలకు వేలం పాట పాడిన విషయం మీడియా మిత్రులకు, మరియు రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిందే. కానీ డిపోలో ఇంత అన్యాయం జరుగుతున్న డిపో మేనేజర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని సిఐటియు మల్లేశం అన్నారు. ఏది ఏమైనా ఐఎంఎల్ డిపోలో నిరుద్యో యువకులకు హమాలీ పని కల్పించే వరకు నిరుద్యోగ యువకుల తరపున పోరాటం చేస్తానని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిరుద్యోగ యువకులకు ఐ ఎం ఎల్ డిపోలో హమాలీ పని కల్పించాలని జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. నిహారదీక్షలో అధ్యక్షుడు మల్లేశం , ఉపాధ్యక్షులు సోమనర్సింలు, కోశాధికారి లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఆర్గనైజర్ కమ్మరి మల్లేశం, కమిటీ సభ్యులు వడ్ల బ్రహ్మచారి, ఎరుకల లక్ష్మణ్, మల్లేశం, ఎరుకల సాలమాన్, జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…