
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 6.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఏర్పాటుచేసిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేదెందుకు ప్రభుత్వం పట్టణాలకు ఊరికో అట స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి ఎకరం నుంచి ఎకరంన్నర స్థలాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది అన్నారు. క్రీడల వలన శారీరిక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రజలందరూ క్రీడ మైదానాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏజెన్సీ ప్రాంతంలోని యువత చదువుతోపాటు క్రీడలలో రాణించి తమ ప్రాంతానికి మన జిల్లాకి మంచి పేరు తీసుకు రావాలనే ఉద్దేశంతో పినపాక మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు జిల్లాల మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను వారి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు,పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.





