జనసముద్రం న్యూస్, తనకల్లు,జనవరి 5:
తనకల్లు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో, జనసముద్రం న్యూస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసిల్దార్ మధు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అలాగే అధికారుల కళ్ళ ముందు ఉంచుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పాత్రికేయుల వృత్తి సమాజంలో ఎంతో గొప్పదని అన్నారు.అలాగే జనసముద్రం న్యూస్ దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజా సమస్యలపై గొంతు విప్పుతూ, ప్రజల మన్ననలను పొందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నారాయణరెడ్డి,మండల సర్వేయర్ నరేష్,మా 6 టీవీ రిపోర్టర్ ఆర్. శీనప్ప, నిఘా చైతన్య దినపత్రిక ఎడిటర్ శంకర, జనసముద్రం న్యూస్ పత్రిక రిపోర్టర్ వైభవ్ నరేష్, రవి పాల్గొన్నారు.