యుగాంతం మొదలైందంటూ శాస్త్రవేత్తల హెచ్చరిక

Spread the love
జనసముద్రం న్యూస్,జనవరి 03:

కంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నారు.

చైనాలో మళ్లీ వెలుగు చూస్తున్న కరోనా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. జీరో కోవిడ్ విధానానికి చైనా స్వస్తి పలకడంతో ఆ దేశంలో రోజుకు కోట్లల్లో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులకు కనీసం బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ భయాందోళన మధ్యే సైంటిస్టులు సైతం యుగాంతంపై హెచ్చరికలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి దాదాపు 90 శాతం అంతరించిపోతుంది. తిరిగి మళ్లీ కొత్తగా జీవరాశి పుట్టుకొట్టుంది. దీనినే సామూహిక నాశనమంటారని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఐదు సార్లు జరిగిందని ఇప్పుడు మనం ఇప్పుడు జరగబోయేది ఆరోదని చెబుతున్నారు.
ప్రస్తుతం మనం ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని సైంటిస్టులు చెబుతుండటం గమనార్హం. ఈసారి రాబోతున్న యుగాంతానికి మనిషి స్వయంకృతాపరధమే కారణమని చెబుతున్నారు. భూమిపై మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఇతర జీవులకు నీడ కూడా లేకుండా పోతుందని వివరించారు.
ఆరున్నర కోట్ల ఏళ్ళ కిందట నాడు బత్రికి ఉన్న రాక్షస బల్లులు.. డైనోసార్లు సహా పలు జీవులన్నీ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
గత 50 ఏళ్లలో భూమిపై ఉన్న జీవుల్లో 69 శాతం కనుమరుగయ్యాయని వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ పేర్కొంది. జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు.. చెరువులు.. గుట్టలు.. నదులు అన్నీ మాయమవుతున్నాయి. జీవులకు నిలువ నీడ లేకుండా పోతుందని అందుకే తరచూ వన్యమృగాలు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఈ ప్రాణులన్నీ బతుకాలంటే ఈ భూమి సరిపోదు.
20 ఏళ్ల కిందట వరకు కూడా ఇంటి చుట్టూరా పక్షుల కిలకిలలు.. కోయిల కుహు.. కుహులు వినిపించేవి. ఇప్పుడు మచ్చుకు కూడా అలాంటి ఘటనలు కన్పించడం లేదు. అడవులు.. పక్షులు.. జంతువులన్నీ కనుమరుగు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అమెజాన్ నది లోయలోని దక్షిణ అమెరికాలోనూ ఇదే పరిస్థితి. 1970 నుంచి ఇప్పటి వరకు అక్కడ 94 శాతం జీవులు మాయమయ్యాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామూహిక ప్రాణి హననం జరగడమే యుగాంతమని.. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఇదేనంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!