జనసముద్రం న్యూస్అ,నంతపురం జిల్లా, ఆత్మకూరు,జనవరి 03:
ఆత్మకూరులో మంగళవారం ఉదయం జరిగిన అయ్యప్ప స్వామి పూజలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మకూరు బైపాస్ రోడ్డు సమీపంలో జరుగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. అక్కడి నుంచి ఆత్మకూరులోకి చేరుకొని వాల్మీకి భవన్ నిర్మాణ పనులను పరిశీలించి నాయకులతో మాట్లాడారు.
వెంకట శివారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ..!
ఆత్మకూరుకు చెందిన వెంకట శివారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ… వెంకట శివారెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకట శివారెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..