
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్డు నందు గల “సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ ఆఫీస్ నందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ,జన సముద్రం పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ మాట్లాడుతూ అనతి కాలంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు ,ప్రజల మధ్య పేరుగాంచిన పత్రికగా చక్కటి పాత్రను పోషించిందని కొనియాడారు.రాబోయే కాలంలో ప్రజా సమస్యలను అధికారులకు చేరవేసి ప్రజల ఆదరణను పొందాలని అన్నారు.ఈ జనసముద్రం క్యాలెండర్ ఆవిష్కరణలో గౌరవ అధ్యక్షులు గుండు నరసింహమూర్తి ,అధ్యక్షులు కొంపెల్లి సంతోష్, ఉపాధ్యక్షుడు గోడిశాల చంద్రం , ప్రధాన కార్యదర్శి నిట్ట వెంకటేశ్వర్లు ,కోశాధికారి కన్నె రమేష్, దొడ్డ శ్రీనివాస్, కల్తి ప్రభాకర్ ,తోకల శంకర్, కొంపెల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.





