మహిళా కోచ్ ను రూమ్ కు రమ్మని వేదిస్తున్న క్రీడా శాఖ మంత్రి..!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30:

”మనం-మనం ఒకటి.. రూమ్కు వచ్చెయ్.. నాకు సహకరించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా” ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మహిళా కోచ్కు ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె ఈ విషయాన్ని రికార్డు చేసి.. బహిర్గతం చేసింది. ఈ విషయం ఇప్పుడు హరియాణ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసింది. ప్రతిపక్షాలు సదరు మంత్రిని వెంటనే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఏం జరిగిందంటే..హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ తనను లైంగిక వేధించాడని జూనియర్ మహిళా అద్లెట్ కోచ్ ఆరోపించారు. మంత్రి తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారని ఆమె తెలిపారు.తనకు అనుకూలంగా వ్యవహరించి రూమ్ వచ్చి.. అరగంట గడిపితే అన్ని సౌకర్యాలు కల్పిస్తానని వ్యాఖ్యానించారని ఆమె ఆరోపణలు గుప్పించారు. మంత్రి సందీప్ నాతో సోషల్ మీడియా ద్వారా చాట్ చేశారని.. కానీ చాట్ రికార్డ్ చేసినట్టు ఆమె తెలిపారు.

“మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తే కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తానని అన్నారు. నేను ఆయనకి లొంగకపోవడం వల్ల వేరే ప్రదేశానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై డీజీపీ ఆఫీస్ సీఎం కార్యాలయం రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది.అందుకే ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలను కలిశా. ఆయన ఇచ్చిన ధైర్యంతో మీడియా ముందుకు వచ్చా. ఇలా చాలా మంది మహిళా క్రీడాకారిణులను మంత్రి లైంగికంగా వేధించారు. వారెవరూ మంత్రికి భయపడి బయటికి చెప్పట్లేదు” అని మహిళా అథ్లెట్ కోచ్  ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా అథ్లెట్ కోచ్పై లైంగిక వేధింపుల విషయంలో హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తక్షణమే స్పందించి.. మంత్రిని బర్తరఫ్ చేయాలని ఐఎన్ఎల్డీ నాయకుడు అభయ్ చౌతాలా డిమాండ్ చేశారు. క్రీడాకారులతో మంత్రి ఇలాగే ప్రవర్తిస్తే వారు మెడల్స్ ఎలా సాధిస్తారని అన్నారు. ఈ ఘటనపై సందీప్ సింగ్ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.

Related Posts

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

Spread the love

Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!