కోటి రూపాయల విలువైన నగలు దొంగతనం..స్టేషన్ లోనే దొంగ..ఊరంతా గాలించిన పోలీసులు..!

Spread the love

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 25 ;

చంకలో పిల్లాడ్ని పెట్టుకొని ఊరంతా వెతికిన సామెత గుర్తుకు వచ్చే ఉదంతం ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసినంతనే అప్పట్లో విడుదలై సక్సెస్ అయిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’ మూవీ గుర్తుకు రావటం ఖాయం. అందులో మురళీక్రిష్ణ క్యారెక్టర్.. పెద్ద మాఫియా డాన్. ఒక ప్రముఖ దర్గాకు వెళ్లేందుకు సిటీకి వచ్చి రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు దొరుకుతాడు. తాను డాన్ అని చెప్పినా పోలీసులు నమ్మరు. ఆ తర్వాత కొన్ని గంటలకు తాము పట్టుకున్నది పెద్ద డాన్ అన్న విషయం తెలిసి ఆశ్చర్యపోతారు.

ఈ రీల్ సన్నివేశం మాదిరే రియల్ సీన్ ఒకటి తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఎదురైంది. తమ కళ్ల ముందున్న దొంగ.. ఒక భారీ చోరీ చేసినోడన్న విషయాన్ని గుర్తించక.. ఆ భారీ చోరీ చేసినోడి కోసం భారీగా వెతుకులాట ఆడటం.. చివర్లో విషయం తెలిసిన వారు షాక్ కు గురైన పరిస్థితి. తన కోసం పోలీసులు భారీగా వెతుకుతూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న వైనాన్ని స్టేషన్ లో ఉన్న ఆ దొంగకు అర్థమవుతున్నా.. నోరు మెదపకుండా ఉండిపోయాడు. చివర్లో అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం అతన్ని పట్టించింది. సినిమాటిక్ గా ఉన్న ఈ వ్యవహారంలోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో మాజీ కేంద్ర మంత్రి చెంచు రామయ్య మనమడు పవన్ కుమార్ కు నగల తయారీ కేంద్రం ఉంది. ఈ నెల 20న అందులో రూ.కోటి విలువైన నగలు.. వజ్రాలు మాయమయ్యాయి. పోలీసులు సీసీ కెమేరాల్ని శోధించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుడు పాత బైక్ మీద నగలతో పారిపోయిన సీన్ రికార్డు అయినా.. అందులో ఎలాంటి వివరాలు లభించలేదు. ఇదిలా ఉంటే.. ఇదే స్టేషన్ కు సంబంధించిన మరో కేసు నమోదైంది. అందులో ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన రెండు సెల్ ఫోన్లు చోరీ అయ్యాయి. సీసీ కెమేరాల్ని చూసినప్పుడు సింగాడికుంట బస్తీలో ఉండే పవన్ తీసినట్లుగా గుర్తించారు.

దీంతో అతనికి పోలీసులకు చెబుతామని వార్నింగ్ ఇవ్వటంతో ర్యాపిడో ద్వారా తానుకొట్టేసిన ఫోన్లను తిరిగి పంపించేశాడు. కానీ.. ఫోన్లతో పాటు డబ్బు కూడా పోయిందని.. ఆ డబ్బులు చెల్లించాలని ఫోన్ ద్వారా చెబితే.. ఫోన్ స్విఛాప్ చేశాడు. ఇదిలా ఉండగా.. తాను ఫోన్లు తిరిగి ఇచ్చేశాను కాబట్టి తననుపట్టించుకోరని భావించిన పవన్.. తాపీగా బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లో టీ తాగుతున్న వేళలో.. సెల్ ఫోన్లు చోరీ అయిన ప్రవీణ్ స్నేహితుడు ఇతన్ని గుర్తించి పట్టుకున్నాడు. పోలీసులకు అప్పగించాడు. అతడితో పాటు.. అతడి పాత టూ వీలర్ ను కూడా తీసుకొని స్టేషన్ కు వెళ్లారు.

స్టేషన్ కు తీసుకెళ్లి అతని జేబులు తనిఖీ చేయగా.. చిల్లర డబ్బులతో పాటు.. బంగారు ఆభరణాలు.. వజ్రాల్ని పరిశీలించే మాగ్నిఫైయింగ్ అద్దం దొరికింది. అప్పటికే కోటి రూపాయిల నగలు పోయిన కేసులో బిజీగా ఉన్న పోలీసులు పవన్ ను పట్టించుకోలేదు. అతన్ని స్టేషన్ లో ఒక మూల కూర్చోబెట్టారు. కోటి చోరీచేసినోడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి.. అతని ముందే వెతకటానికి పంపారు. ఇదంతా చూస్తూ కామ్ గా ఉండిపోయాడు. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు రూ.కోటి నగలు పోగొట్టుకున్న ఫిర్యాదుదారుడు స్టేషన్ కు వచ్చాడు.

పోలీసులతో మాట్లాడుతూ.. టేబుల్ మీద ఉన్న మ్యాగ్నిఫైయింగ్ అద్దాన్నిచూసి.. అది తనదేనని చెప్పాడు. దీంతో అలెర్టు అయిన పోలీసులు.. సెల్ ఫోన్ దొంగను గుర్తించి.. అతడ్ని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాన్ని చెప్పేశాడు. అతడితో పాటు స్వాధీనం చేసుకున్న డొక్కు టూవీలర్ సీటు కింద రూ.బంగారు వజ్రాభరణాలు దొరికాయి. తమ కళ్ల ముందే దొంగను ఉంచుకొని దాదాపుపది గంటల పాటు హైరానా పడిన వైనం గుర్తించి షాక్ తిన్నారు. పవన్ను విచారించగా.. సింగాడికుంటకుచెందిన అంజితో కలిసి తాము చోరీ చేసిన విషయాన్ని గుర్తించారు. మొత్తం మీదా బంగారు.. వజ్రాభరాల్లో చాలావరకు రికవరీ చేయగా.. కొంత బంగారాన్నిమాత్రం మణప్పురం ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి రూ.లక్షన్నర తీసుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాట్ టాపిక్ గా మారింది.  జరిగినదంతా తలుచుకుంటున్న పోలీసులు నవ్వలేని పరిస్థితి. ఏమైనా.. తప్పుచేసినోడు ఏదో రకంగా దొరుకుతాడన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్నిచెప్పక తప్పదు.

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!