జనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి
ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.:
ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో వచ్చే జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని. అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని. ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని తెలిపారు.